జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలని బ్యాలన్స్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా పవన్ ఏకంగా ఒకేసారి మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు కమెడియన్ అలీ మంచి మిత్రుడు. ఈ విషయం ఇండస్ట్రీతో పాటు అభిమానులకు కూడా బాగా తెలుసు. 

పలు సందర్భాల్లో పవన్.. అలీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. పవన్ నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో అలీ కనిపిస్తాడు. ఇంతటి స్నేహ సంబంధాలు ఉన్న అలీ, పవన్ మధ్య రాజకీయాల వల్ల మనస్పర్థలు ఏర్పడ్డాయి. గతసార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అలీ వైసిపిలో చేరాడు. అప్పటి నుంచి వీరి మధ్య గ్యాప్ ఏర్పడింది. 

ఆ సమయంలో పవన్ విమర్శలకు అలీ హర్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరూ కలుసుకున్న సందర్భాలు పెద్దగా లేవు. ఇదిలా ఉండగా అలీ ఇటీవల వైజాగ్ కు ఓ కార్యక్రమం కోసం వెళ్ళాడు. అక్కడ సభలో అలీ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పరోక్షంగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

ప్రకాశ్ జవదేకర్ ను కలిశా, దాని కోసమే....: ఢిల్లీ పర్యటనపై కమెడియన్ అలీ

'ఎవరిని ఎక్కడ ఉంచాలో వైజాగ్ ప్రజలకు బాగా తెలుసు' అని అలీ ఘాటు కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అలీ పరోక్షంగా ఈ కామెంట్స్ చేయనప్పటికీ అందులో అంతరార్థాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నంలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల నుంచి పవన్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. 

జనసేన పొత్తు ఎఫెక్ట్, పవన్ కల్యాణ్ తో దోస్తీ: కమెడియన్ అలీ అందుకే...

అలీ ఈ అంశాన్నే పరోక్షంగా చెబుతూ నేరుగా పవన్ ని గుచ్చుకునేలా కామెంట్స్ చేశాడు. మరో ఇంటర్వ్యూలో అలీ పవన్ కళ్యాణ్ సినిమాలని ఉద్దేశించి కూడా మాట్లాడాడు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న చిత్రాల్లో ఏదో ఒక దానిలో అలీ నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. 

నడుము సొగసుతో శ్రీయ అందాల విందు.. వైరల్ అవుతున్న హాట్ పిక్స్!

దీనిపై అలీ కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమా కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఒకవేళ అడిగితే తప్పకుండా నటిస్తా. నేను రాజకీయాలని, సినిమాలని కలిపి చూడనని అలీ తెలిపాడు. అలీ వ్యాఖ్యలతో పవన్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య మనస్పర్థలు త్వరగా తొలగిపోవాలని కోరుకుంటున్న అభిమానులు కూడా ఉన్నారు.