దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ ఉద్యమ వీరుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ కోసం చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ చిత్రం జులై 30న విడుదల కానున్న నేపథ్యంలో త్వరలోనే ఫస్ట్ లుక్ ఉంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కొమరం భీం లుక్ పై సెలెబ్రిటీల ఫిజికల్ ట్రైనర్ లియోర్డ్ స్టీవెన్స్ అంచనాలు పెంచేశాడు. తాజాగా స్టీవెన్స్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 

RRRలో ఆయన లేరట.. రాజమౌళి సినిమాలో ఈ ట్విస్టులేంటి!

స్టీవెన్స్ ట్వీట్ చేస్తూ.. ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనింగ్ పూర్తయింది. ఎన్టీఆర్ డెడికేషన్, హార్డ్ వర్క్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొమరం భీంగా ఎన్టీఆర్ లుక్ చూసి మీ మతిపోవడం ఖాయం.. చూస్తూ ఉండండి అని పేర్కొన్నాడు. 

తండ్రి వల్లే బలైందా.. అంతా అసత్యం, ఐటీ రైడ్స్ పై రష్మిక రియాక్షన్!

దీనితో ఎన్టీఆర్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ తో అదరగొట్టడం వెనుక ఉంది కూడా స్టీవెన్సే. అంతకు మించేలా.. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర ఉంటుందనడంలో సందేహం లేదు.