Asianet News TeluguAsianet News Telugu

నితిన్ 'భీష్మ' టీజర్: యాక్షన్, కామెడీ, రొమాన్స్.. సింపుల్ గా అదిరింది!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ. యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలిసారి రష్మిక మందన, నితిన్ జంటగా నటిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని నితిన్ నటిస్తున్న చిత్రం ఇది. 

Nithiin's Bheeshma movie teaser
Author
Hyderabad, First Published Jan 12, 2020, 11:18 AM IST

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ. యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలిసారి రష్మిక మందన, నితిన్ జంటగా నటిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని నితిన్ నటిస్తున్న చిత్రం ఇది. 

ఛలో లాంటి సూపర్ హిట్ మూవీతో అందరి దృష్టిని వెంకీ కుడుముల ఆకర్షించాడు. దీనితో భీష్మ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో క్రమంగా ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేస్తోంది. తాజాగా భీష్మ టీజర్ ని రిలీజ్ చేశారు. 

టీజర్ ఆధ్యంతం ఫన్, రొమాంటిక్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది. 'మీ తర్వాత మీ ఆస్తిని, ఇంత పెద్ద కంపెనీని మీ ఆలోచనలకు అనుగుణంగా చూసుకునేది ఎవరు సర్ అనే వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. చిన్న యాక్షన్ బిట్ ని రివీల్ చేసిన తర్వాత నితిన్ అసలు రచ్చ మొదలు పెట్టాడు. 

అజ్ఞాతవాసి అంటూ దారుణంగా మీమ్స్.. అల్లు అర్జున్ పై ఇలాంటి ట్రోల్సా!

ఈ చిత్రంలో నితిన్ వెటకారం ఉన్న కుర్రాడిగా చెబుతున్న డైలాగులు మంచి ఫన్ క్రియేట్ చేస్తున్నాయి. సంపత్ రాజ్, నితిన్ మధ్య జరిగే సంభాషణ, వెన్నెల కిషోర్ హావ భావాలు నవ్వులు పూయించే విధంగా ఉన్నాయి. టీజర్ చివర్లో నితిన్ ఫన్నీ డైలాగ్ తో ఆకట్టుకుంటున్నాడు. 'ఎవరి వాల్యూ ఐన బతికున్నప్పుడు కంటే చనిపోయాకే పెరుగుతుంది అని నితిన్ అంటాడు.. అదెలా అని వెన్నెల కిషోర్ ప్రశ్నిస్తాడు. ఒక కోడి బతికున్నప్పుడు కిలో రూ 90.. అదే చనిపోతే కిలో 190 అని నితిన్ చెప్పే డైలాగ్ బావుంది. 

'అల.. వైకుంఠపురములో' ట్విట్టర్ రివ్యూ.. ఆ ఎపిసోడ్స్ అదిరిపోయాయి!

ఇక నితిన్, రష్మిక మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా బాగానే కుదిరింది. చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ యూత్ ని బాగా ఆకర్షించేలా ఉంది. మొత్తంగా భీష్మ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios