కళ్యాణ్ రామ్ చివరగా నటించిన చిత్రం 118. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కు దక్కిన హిట్ ఇదే. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ జాగ్రత్తగా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శత్వంలో ఎంత మంచివాడవురా అనే మూవీలో నటిస్తున్నాడు. 

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ చేయబోయే చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. దర్శకుడు వేణు మల్లిడి చెప్పిన కథకు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

బాలయ్య మరోసారి ఎన్టీఆర్ అవతారం ఎత్తుతాడా..?

ఈ చిత్రం టైం మెషిన్ నేపథ్యంలో ఉంటుందట. టైం మెషిన్ లో హీరో 500 ఏళ్ల వెనక్కి.. 500 ఏళ్ల భవిష్యత్తులోకి వెళ్లే కథతో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇదే కథాంశంతో నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 చిత్రం తెరకెక్కింది. ఆ చిత్రం బాలయ్య కెరీర్ లో ఓ క్లాసిక్ గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. 

ఆ మూవీలో బాలయ్య మోడ్రన్ యువకుడిగా, శ్రీకృష్ణదేవరాయులుగా అదరగొట్టారు. మరి కళ్యాణ్ రామ్ ఎలా నటించబోతున్నాడు అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ చిత్రం కనుక పట్టాలెక్కితే సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం. అదే సమయంలో ప్రతి ఒక్కరు ఆదిత్య 369తో పోలిక పెడతారు. ఒక రకంగా ఇది కళ్యాణ్ రామ్ కు ఇది రిస్క్ అని చెప్పొచ్చు. 

ఫ్లాప్ హీరోయిన్ కి భారీ రెమ్యునరేషన్.. అడ్డు చెప్పని బాలయ్య?

ఆదిత్య 369 సీక్వెల్ కి సంబంధించిన వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. ఈ చిత్రానికి సీక్వల్ వస్తే బావుంటుందనేది నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయం. బహుశా ఇదే ఆ సీక్వెల్ ఏమో.