కెఎస్ రవికుమార్, బాలయ్య కాంబోలో వస్తున్న రెండవ చిత్రం రూలర్. ఈ చిత్రం ఫస్ట్ లుక్, పోస్టర్స్ తోనే ఆసక్తిని పెంచుతోంది. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా మరో లుక్ లో కనిపిస్తున్నాడు. 

ఈ చిత్రంలో బాలయ్య సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోనాల్ చౌహన్, వేదిక రూలర్ మూవీ లో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోనాల్ చౌహన్ తరచుగా తెలుగు చిత్రాల్లో నటిస్తూనే ఉంది. కానీ వేదికకు ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఆమెకు తెలుగులో సరైన సక్సెస్ లేదు. కొన్నేళ్ల క్రితం బాణం, విజయదశమి, దగ్గరగా దూరంగా అనే చిత్రాల్లో నటించింది. 

ఆ చిత్రాలన్నీ నిరాశపరిచాయి. దీనితో టాలీవుడ్ కు వేదిక దూరమైంది. ఈ ఏడాది విడుదలైన కాంచన 3 తెలుగు డబ్బింగ్ చిత్రంతో వేదిక మరోమారు టాలీవుడ్ ని పలకరించింది. ఈ చిత్రం విజయం సాధించడంతో వేదిక అందరి దృష్టిని ఆకర్షించింది. వెంటనే ఆమెకు బాలయ్య సరసన రూలర్ చిత్రంలో అవకాశం దక్కడం విశేషం. 

ఈ చిత్రం కోసం వేదిక 30 లక్షల రెమ్యునరేషన్ అందుకుంటోందట. తెలుగు లో ఎలాంటి సక్సెస్ లేని హీరోయిన్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం ఆశ్చర్యకరమే. టాలీవుడ్ లో పాపులర్ అయిన కొందరు హీరోయిన్ల కంటే వేదిక రెమ్యునరేషన్ ఎక్కువని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  

రూలర్ చిత్రంలో బాలయ్య సరసన వేదిక ఫిట్ అవుతుందనే దర్శకుడు ఆమెని ఎంపిక చేసుకున్నారట. సాధారణంగా ఫ్లాప్ హీరోయిన్లని ఎంచుకోవడానికి హీరోలు ఆలోచిస్తారు. కానీ బాలయ్య దర్శకుడి నిర్ణయానికి అడ్డు చెప్పలేదట.