నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా 'ఎన్టీఆర్' బయోపిక్. రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమాను బాలయ్య స్వయంగా నిర్మించారు. చాలా ఏళ్ల పాటు చేసిన రీసెర్చ్ తో ఈ సినిమా తీశారు. తన తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోవాలని బాలయ్య అనుకున్నారు.

కానీ ఈ సినిమా కాస్త డిజాస్టర్ గా నిలిచింది. బాలయ్య కెరీర్ లో అత్యధిక నష్టాలు తీసుకొచ్చిన చిత్రంగా మిగిలిపోయింది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటించినందుకు చాలా మంది అతడిని విమర్శించారు. బయోపిక్ చేయకుండా ఉంటే బాగుండేదని కామెంట్స్ చేశారు.

హాట్ లుక్ లో తమన్నా మెరుపులు.. వైరల్ అవుతున్న ఫొటోస్

అయితే ఇప్పుడు బాలయ్య మరోసారి తన తండ్రి పాత్రపోషించబోతున్నారని సమాచారం. తమిళంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో 'తలైవి' అనే సినిమారూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్యతో చేయించాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి.. బాలయ్య నటించిన 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఈ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది కూడా శ్రీవిష్ణు అని చెబుతారు. ఇప్పుడు జయలలిత బయోపిక్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జయలలిత కథలో ఎన్టీఆర్ తో పాటు శోభన్ బాబుల పాత్రలు కూడా ఉంటాయట.

ఎన్టీఆర్ పాత్రని బాలయ్యతో చేయిస్తే బాగుంటుందని నిర్మాత విష్ణుతో పాటు దర్శకుడు ఏ.ఎల్. విజయ్ కూడా అనుకుంటున్నారట. విష్ణు అడిగితే బాలయ్య కాదనకపోవచ్చని అంటున్నారు. మరి బాలయ్య మరోసారి ఎన్టీఆర్ అవతారం ఎత్తడానికి సిద్ధమవుతాడో లేక కాదంటారో చూడాలి!