కింగ్ నాగార్జున చివరగా నటించిన మన్మథుడు 2చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. రాహుల్ రవీంద్రన్ దర్శత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నాగ్ ఫ్యాన్స్ కు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం నాగార్జున ఓ డిఫెరెంట్ చిత్రంలో నటిస్తున్నాడు. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే నాగార్జున తన కెరీర్ లో ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తున్నాడు. 

డెబ్యూ డైరెక్టర్ అశిషోర్ సోలమన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. నాగార్జున ఎన్ఐఏ అధికారిగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఇదివరకే విడుదల చేశారు. ఈ మూవీలో నాగ్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా,ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. 

రెండోసారి తల్లైన స్నేహ.. ఏంజెల్ లాంటి పాపాయి అంటూ పోస్ట్!

తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ మూవీలో నాగార్జునకి హీరోయిన్ గా 38 ఏళ్ల బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జాని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. దియా మీర్జా నాగార్జునకు భార్యగా నటిస్తోందట. ఆమెకు ఇదే తొలి తెలుగు చిత్రం. దియా మీర్జా హైదరాబాద్ లో జన్మించినప్పటికీ ఇంతవరకు టాలీవుడ్ లో నటించలేదు. 

పవన్ కళ్యాణ్ కు జోడీగా ఫ్లాప్ హీరోయిన్ ?.. క్రిష్ డైరెక్షన్ లో పీరియాడిక్ ఫిల్మ్!

త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. దియా మీర్జా చివరగా సంజు చిత్రంలో నటించింది. నాగార్జునకు పోలీస్, ఆర్మీ రోల్స్ కొత్త కాదు. గగనం చిత్రంలో నాగ్ ఆర్మీ అధికారిగా మెప్పించాడు. ఇప్పుడు ఎన్ఐఏ అధికారిగా నటిస్తుండడంతో ఆసక్తి నెలకొంది.