సౌత్ ఇండియన్ సెలెబ్రిటీ కపుల్ స్నేహ, నటుడు ప్రసన్న కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. స్నేహ, ప్రసన్న దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. జనవరి 24 శుక్రవారం రోజు స్నేహ పండంటి పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. 

ఈ గుడ్ న్యూస్ ని స్నేహ భర్త ప్రసన్న సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'ఏంజెల్ వచ్చింది' అని పోస్ట్ పెట్టాడు. దీనితో సోషల్ ఇండియాలో ప్రసన్న, స్నేహ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

దక్షిణాదిలో స్నేహ హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో ఆమె శ్రీరామదాసు, వెంకీ, సంక్రాంతి, ప్రియమైన నీకు లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 2012లో స్నేహ తమిళ నటుడు ప్రసన్నని ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత హీరోయిన్ రోల్స్ కి స్వస్తి చెప్పిన స్నేహ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ తో రాణిస్తోంది. 

ఈ దంపతులకు ఇప్పటికే ఓ కొడుకు ఉన్నాడు. తన కొడుకు విహాన్ తో ఉన్న ఫోటోలని స్నేహ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పాప కూడా జన్మించడంతో స్నేహ, ప్రసన్న కుటుంబంలో సంతోషం రెండింతలైంది అని చెప్పొచ్చు. 

గర్భంతో ఉన్నపటికీ ఆ పని చేసిందా.. సీనియర్ హీరోయిన్ వీడియో వైరల్!

స్నేహ చివరగా తెలుగులో వినయవిధేయ రామ చిత్రంలో రాంచరణ్ కు వదిన పాత్రలో నటించింది. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన పటాస్ చిత్రంలో కూడా స్నేహ కీలకపాత్రలో మెరిసింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో స్నేహ గర్భవతిగా ఉన్నపటికీ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందింది. పటాస్ చిత్రంలో యాక్షన్ సీన్స్ లో అదరగొట్టింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Angel arrived ❤❤

A post shared by Prasanna_actor (@prasanna_actor) on Jan 24, 2020 at 1:54am PST