జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాల్ని, ఇటు సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం పింక్ తెలుగు రీమేక్ ఇప్పటికే ప్రారంభమైంది. హిందీలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పటికే తమిళంలో రీమేక్ చేశారు. నెర్కొండ పార్వాయిగా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ కూడా విజయాన్ని అందుకుంది. తెలుగులో ఈ చిత్రానికి లాయర్ సాబ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. 

వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా దిల్ రాజు నిర్మాత. ఇదిలా ఉండగా పింక్ రీమేక్ తో పాటు పవన్ మరో చిత్రంలో కూడా నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రతిభగల దర్శకుడు క్రిష్ దర్శత్వంలో ఓ పరియాడిక్ ఫిల్మ్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జనవరి 27న ఈ చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ అంటే ప్రస్తుతం ఫామ్ లో ఉన్న క్రేజీ బ్యూటీలు నటిస్తారని ఫ్యాన్స్ అనుకుంటారు. కాయాన్ని క్రిష్ మాత్రం పవన్ కు ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

పవన్ కళ్యాణ్ మాటలకు గూస్ బంప్స్.. తమన్ కామెంట్స్

కంచె చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రగ్య జైస్వాల్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్ కు కెరీర్ లో సరైన హిట్ లేదు. అందం, అభినయం పరంగా ఓకే అనిపించినప్పటికీ.. ప్రగ్యా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రగ్యా అవకాశం దక్కించుకున్న వార్తలు నిజమైతే.. ఇది ఆమెకు బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. 

పునర్నవి బోల్డ్ అవతారం.. వైరల్ అవుతోన్న ఫోటో!

మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో క్రిష్ ఈ చిత్రాన్ని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించనున్నారు. పవన్ ఈ చిత్రంలో బందిపోటు దొంగగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో ఖుషి, బంగారం లాంటి చిత్రాలు నిర్మించిన ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాత.