మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ యాజమాన్యంతో విభేదాలు, ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో భిన్నాభిప్రాయాలతోనే నాగబాబు జబర్దస్త్ తో నుంచి తప్పుకున్నట్లు ఇటీవల యూట్యూబ్ ద్వారా ప్రకటించారు. 

నాగబాబు ఏళ్లపాటు జబర్దస్త్ తో లో జడ్జిగా కొనసాగారు. ఒక్కసారిగా ఆయన తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత ప్రముఖ ఛానల్ జీ నెట్వర్క్ నాగబాబుతో కొత్త కామెడీ షో ని ప్రారంభించింది. ఈ షోకు 'అదిరింది' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ షో తొలి ఎపిసోడ్ ఈ ఆదివారం డిసెంబర్ 22న ప్రసారం కాబోతోంది. 

తొలి ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమోని విడుదల చేశారు. ప్రోమో చూస్తుంటే 'అదిరింది' షో జబర్దస్త్ కు డూప్లికేట్ అనే ఫీలింగ్ రాక మానదు. అచ్చు గుద్దినట్లు ఈ షోలో జబర్దస్త్ ఫార్మాట్ ని ఫాలో అయిపోయారు. ఈ షోకు జడ్జిగా నాగబాబు వ్యవహరించనున్నారు. తొలి షోలో స్పెషల్ గెస్ట్ గా నాగబాబు కుమార్తె నిహారిక హాజరైంది. 

జబర్దస్త్ షో సక్సెస్ కావడానికి యాంకర్స్ రష్మీ, అనసూయ కూడా ఓ కారణం. అదిరింది షోలో టివి నటి సమీర యాంకర్ గా వ్యవహరిస్తోంది. రష్మీ, అనసూయ స్థాయిలో సమీర ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. 

ఓవర్సీస్ క్రేజ్ : మహేష్ ని మించిపోయిన బన్నీ

తొలి ఎపిసోడ్ కు హీరో రాజ్ తరుణ్ అతిథిగా హాజరయ్యాడు. డిసెంబర్ 25న రాజ్ తరుణ్ నటించిన ఇద్దరిలోకం ఒకటే చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షోలో ధనరాజ్, కిరాక్ ఆర్పీ, కమెడియన్ వేణు, చమ్మక్ చంద్ర తమ స్కిట్స్ తో అలరించబోతున్నారు. ఈ షో కోసం జీ సంస్థ నాగబాబుకు భారీగా రెమ్యునరేషన్ అందిస్తున్నట్లు టాక్. మరి జబర్దస్త్ స్థాయిలో 'అదిరింది' సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది. 

రోమ్ నగరంలో నితిన్, రష్మిక.. భీష్మ క్రేజీ అప్డేట్!