యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం భీష్మ. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం దర్శకుడు వెంకీ కుడుముల పాటల చిత్రీకరణ ప్రారంభించాడు. 

నితిన్ రష్మిక మధ్య అదిరిపోయే డ్యూయెట్ కోసం చిత్ర యూనిట్ చారిత్రాత్మక రోమ్ నగరానికి వెళ్ళింది. రోమ్ లోని అందమైన ప్రదేశాల్లో ఓ పాటని చిత్రీకరించబోతున్నారు. రోమ్ నగరంలో ల్యాండ్ అయిన తర్వాత నితిన్, రష్మిక మందనతో కలసి శేఖర్ మాస్టర్ సెల్ఫీ తీసుకున్నాడు. 

ఈ ఫోటోని నితిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలో నితిన్ కూల్ లుక్ లో కనిపిస్తున్నాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రెండు పాటలని రోమ్ నగరంలో చిత్రీకరించబోతున్నారు. ఈ రెండు పాటల్లో నితిన్ డాన్స్ తో అదరగొట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్.. ఫోటోలపై క్లారిటీ ఇదే!

శ్రీనివాస కళ్యాణం లాంటి డిజాస్టర్ తర్వాత నితిన్ నుంచి వస్తున్న చిత్రం ఇది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నితిన్, రష్మిక మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణ కానుండడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని విడుదుల చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.