Asianet News TeluguAsianet News Telugu

ఓవర్సీస్ క్రేజ్ : మహేష్ ని మించిపోయిన బన్నీ

మిలియన్ డాలర్ క్లబ్ అనేది మహేష్ చాలా ఈజీ టాస్క్ అయిపోయింది. మహేష్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే రెండు నుండి మూడు మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు వస్తుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

Allu Arjun dominates overseas over Mahesh Babu
Author
Hyderabad, First Published Dec 19, 2019, 5:11 PM IST

టాలీవుడ్ హీరోల్లో ఓవర్సీస్ లో ఓ రేంజ్ మార్క్ సెట్ చేసిన హీరో ఎవరంటే ముందుగా గుర్తొచ్చేసి మహేష్ బాబే.. ఎందుకంటే అక్కడ తొలి మిలియన్ డాలర్ సినిమా మహేష్ బాబు నటించిన 'దూకుడు'. ఆ తరువాత కూడా అతడి ప్రభంజనం కొనసాగింది. మిలియన్ డాలర్ క్లబ్ అనేది మహేష్ చాలా ఈజీ టాస్క్ అయిపోయింది.

మహేష్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే రెండు నుండి మూడు మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు వస్తుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఓవర్సీస్ లో మహేష్ తన క్రేజ్ ని కోల్పోతూ వస్తున్నాడు. అతడు నటించిన 'మహర్షి'లో పాజిటివ్ టాక్ వచ్చినా.. 2 మిలియన్ డాలర్ల వసూళ్లు కూడా రాలేదు. నిజానికి ఏఎ సినిమా అక్కడ బయ్యర్లకు నష్టాలను తీసుకొచ్చింది.

మహేష్ కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు. విషయంలో కూడా హైప్ అంతగా కనిపించడం లేదు. మహేష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా బిజినెస్ తక్కువగా అయిందనే చెప్పాలి. మహేష్ తో పోలిస్తే ఓవర్సీస్ లో అల్లు అర్జున్ మార్కెట్ తక్కువ. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది.

''బాలయ్య అసిస్టెంట్లను మాత్రమే కొడతారు..''

అల్లు అర్జున్ నటించిన కొత్త సినిమా 'అల.. వైకుంఠపురములో'కి ఓవర్సీస్ లో బజ్ ఎక్కువగా కనిపిస్తుంది. మహేష్ 'సరిలేరు' కంటే బన్నీ సినిమాకి క్రేజ్ పెరిగింది. కంటెంట్ పరంగా చూసుకుంటే మహేష్ సినిమా మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో కూడి ఉంది. 'అల.. వైకుంఠపురములో' మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాకి ప్లస్ అవుతోంది. పైగా సినిమాలో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో మహేష్ సినిమాతో పోలిస్తే బన్నీ సినిమాకే ఎక్కువ హైప్ ఉందనే విషయం స్పష్టమవుతోంది. అదే స్థాయిలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.

జనవరి 11న భారీ స్థాయిలో ప్రీమియర్లు పడనున్నాయి. 'అల.. వైకుంఠపురములో' కచ్చితంగా నాన్-బాహుబలి రికార్డ్ లు బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సినిమా టాక్ బాగుంటే గనుక సంక్రాంతి రేసులో ఈ సినిమా దూసుకుపోవడం ఖాయం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios