యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం అశ్వథ్థామ. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అశ్వథ్థామ చిత్రం జనవరి 31న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారంరోజు ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ప్రీరిలీజ్ వేడుకలో నాగశౌర్య తన ప్రసంగంతో ఆకట్టుకున్నాడు. 

తాను ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పనిచేశానని తెలిపాడు. ఈ చిత్రంతో అనేక విషయాలు తెలుసుకున్నా. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ నిజాతీయగా ఈ చిత్రం కోసం కష్టపడ్డాననే సంతృప్తి ఉన్నట్లు నాగశౌర్య చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంపై ప్రేమతో చెస్ట్ భాగంలో టాటూ కూడా వేసుకున్నానని శౌర్య తెలిపాడు. ఈ చిత్రం ప్రారంభం అయ్యాక నాతో ఉంటానని చెప్పిన వాళ్ళు కూడా వెళ్లిపోయారు. 

నడుము చూపిస్తే తప్పు లేదా ?.. ఎక్స్ ఫోజింగ్ పై పూజా హెగ్డే కామెంట్స్!

ఎవరు ఎలాంటి వారో ఈ చిత్రంతో తీసుకునే అవకాశం వచ్చింది. ఖమ్మంలో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. తాను హోటల్ నుంచి ప్రీరిలీజ్ వేదిక వద్దకు వస్తుండగా చాలా మంది బైక్ ర్యాలీతో వచ్చారు. నాకు అప్పుడే ఎన్టీఆర్ అన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. 

చిరు కుమార్తె ప్రేమ వివాహంలో ఆయన కుట్ర.. పోసాని ఘాటు వ్యాఖ్యలు!

ఎన్టీఆర్ అన్న ఎక్కడికి వెళ్లినా.. అభిమానులని ఉద్దేశించి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.. బైకులు వేగంగా నడపొద్దు అని చెబుతుంటాడు. తారక్ అన్న ఎదో చెబుతున్నాడులే అని అనుకునే వాడిని. మీరు బైక్ ర్యాలీగా వస్తున్నపుడు అర్థం అయింది.. తారక్ అన్న చెప్పేది కరెక్ట్ అని. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము. జాగ్రత్తగా వెళ్ళండి అని నాగ శౌర్య తన ప్రసంగంలో పేర్కొన్నాడు.