నాని నటించిన మజ్ను చిత్రంలో హీరోయిన్ గా నటించింది అను ఇమ్మాన్యుయేల్. ఆ చిత్రం విజయం సాధించడంతో అనుకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత అను ఇమ్మాన్యుయేల్ నటించిన చిత్రాలు అంతగా రాణించలేదు. అయినా కూడా అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. 

అయినా ఏం ఫలితం.. అదృష్టం కలసి రాకపోవడంతో భారీ ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి చిత్రం కాస్త తీవ్రంగా నిరాశపరిచింది. అప్పటికీ అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్ తో అదరగొడుతుండడంతో బన్నీ సరసన నాపేరు సూర్య చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ చిత్రం కూడా నిరాశపరిచింది. 

ఇలా అను ఇమ్మాన్యుయేల్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండడంతో ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర పడింది. తాజాగా తమిళ దర్శకుడు మిస్కిన్ అను ఇమ్మాన్యుయేల్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ దర్శకుడు తెరకెక్కించిన సైకో చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నిత్యామీనన్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటించారు. 

ఇద్దరు హీరోయిన్లతో కలసి పనిచేయడం గురించి మాట్లాడుతూ ఉండగా అనుఇమ్మాన్యుయేల్ ప్రస్తావన వచ్చింది.గతంలో మిస్కిన్ దర్శకత్వంలో అను తిప్పారివలన్ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఆండ్రియా కూడా మరో హీరోయిన్ గా నటించింది. 

నితిన్ తర్వాత మరో హీరో.. మలయాళీ పిల్ల మాయలో టాలీవుడ్ హీరోలు!

సెట్స్ లో అను ఇమ్మాన్యుయేల్ యాటిట్యూడ్ ప్రదర్శిస్తుందని, అలాంటి వాళ్ళు ఎదగడం కష్టం అని మిస్కిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కిందపడిపోయే సీన్ లో నటించాలి. అను ఇమ్మాన్యుయేల్ డ్రెస్ పాడవకూడదని ఆండ్రియా కొన్ని సూచనలు చేసింది. దీనితో అను అమ్మాన్యుయేల్.. నీ పని నువ్వు చూసుకో అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. 

గ్లామర్ డోస్ పెంచేసిన శ్రద్దా.. మత్తెక్కిస్తున్న హాట్ ఫొటోస్

ఆ సంఘటనకు సెట్స్ లో అందరం షాక్ అయ్యామని మిస్కిన్ తెలిపాడు. తాను అను ఇమ్మాన్యుయేల్ ని పక్కకు తీసుకెళ్లి మందలించినట్లు తెలిపాడు. ఆండ్రియా నీకన్నా సీనియర్ నటి. ఆమెని నువ్వు గౌరవించాలి అని తెలిపానని అన్నాడు. 

అడ్డంగా బుక్కైన నటుడి కుమార్తె.. ఆసుపత్రిలో ఏం చేసిందంటే!