తరచుగా వివాదాల్లో చిక్కుకోవడం బాలీవుడ్ సెలెబ్రెటీలకు అలవాటే. బాలీవుడ్ సీనియర్ నటుడు నజీరుద్దీన్ షా కుమార్తె హీబా షా తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై ముంబైలో కేసు కూడా నమోదైంది. ఆసుపత్రిలో మహిళా సిబ్బందిపై హీబా షా అనుచిత ప్రవర్తనే ఇందుకు కారణం. 

జనవరి 16న తన స్నేహితురాలికి  చెందిన రెండు పిల్లులని స్టెరిలైజేషన్ ముంబైలోని వెటర్నరీ క్లినిక్ కు తీసుకువెళ్ళింది. అక్కడ ఆసుపత్రిలోని మహిళా సిబ్బందిపై హీబా షా దాడికి దిగిన సంఘటన సిసి టివిలో రికార్డ్ అయింది. దీనిపై ఆసుపత్రి చైర్మన్ మాట్లాడారు. పిల్లులకు స్టెరిలైజేషన్ జరుగుతోందని.. 5 నిమిషాలు వేచి ఉండాలని సిబ్బంది హీబా షాని కోరారు. 

దీనికి ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నేను ఎవరో తెలుసా.. నన్నే వేచి ఉండమని చెబుతారా అంటూ మహిళా సిబ్బందిపై దాడికి దిగింది. ఈ దృశ్యాలన్నీ సిసి టివిలో రికార్డ్ కావడంతో హీబా షా బండారం బయటపడింది. పోలిసుల ముందు తాను మహిళా సిబ్బందిపై చేయి చేసుకున్న మాట వాస్తవమే అని ఒప్పుకుంది. 

కానీ అంతకంటే ముందుగా వారు తనతో అమర్యాదగా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. తనని లోపలి అనుమతించడానికి అనేక ప్రశ్నలు అడిగారు.. లోపలి వెళ్ళాక ఓ మహిళా సిబ్బంది నాతో అసభ్యంగా ప్రవర్తించింది.. అందుకే అలా ప్రవర్తించాల్సి వచ్చిందని హీబా చెప్పుకొచ్చింది. 

ఇప్పుడే రచ్చ రచ్చ అయింది.. పవన్, ఎన్టీఆర్, మహేష్ ముగ్గురూ దూకితే..

హీబా తండ్రి నజీరుద్దీన్ షా క్రిష్, డర్టీపిక్చర్ లాంటి ఎన్నో చిత్రాల్లో  నటించారు. హీబా కూడా బాలీవుడ్ లో నటిగా కొనసాగుతోంది.