సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ దర్బార్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో పోలీస్ అధికారిగా రజనీ పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. 

విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. మురుగదాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్బార్ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాను ఈ చిత్రం రూపొందించలేదన్నారు. అలెక్స్ పాండియన్ పాత్రతో పూర్తి స్థాయిలో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చాలా రోజుల క్రితం వచ్చింది. 

రజనీకాంత్ గారిని కలిసినప్పుడు ఓ కథ వినిపించాయి. అది ఆయనకు బాగా నచ్చింది. కొంత కలం తర్వాత ఆ కథపై నమ్మకం కుదరక పక్కన పెట్టేశా. ఎలాగైనా సూపర్ స్టార్ తో సినిమా చేయాలనే కోరికతో అలెక్స్ పాండియన్ పాత్ర తరహాలో రజనీకాంత్ ని పోలీస్ అధికారిగా చూపిస్తూ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాసుకున్నా. ఈ కథ కూడా ఆయనకు బాగా నచ్చింది అని మురుగదాస్ తెలిపారు. 

తమన్నా కెరీర్ లో బెస్ట్ మూవీస్.. పెర్ఫామెన్స్ చింపేసింది!

దర్బార్ కథ గురించి ఇప్పుడే అలన్తి విషయాలు రివీల్ చేయను. సినిమా చూసి తెలుసుకోవాలి. కానీ పాన్ ఇండియా అప్పీల్ కోసం ముంబైలో చిత్రీకరించాం. రజని పోలీస్ కమిషనర్ గా కనిపించారు. రజనీకాంత్ పొలిటికల్ కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం తెరకెక్కించలేదు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం అలా ఉంటాయి అని మురుగదాస్ అన్నారు. 

గ్యాంగ్ లీడర్ తో రాములమ్మ.. ఎన్నో ఏళ్ల తర్వాత.. ఫాన్స్ కు పండగే!

ఈ చిత్రంలో మహిళల సంరక్షణకు సంబంధించిన అంశాలు కూడా కొన్ని ఉంటాయని మురుగదాస్ అన్నారు. ఇక రజని రాజకీయాల్లోకి వెళుతుండడంపై స్పందించాలని కోరగా.. రజనీకాంత్ రాజకీయాల గురించి మాట్లాడేంత సీన్ నాకు లేదు. కానీ ఆయనలో ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంది అని మురుగదాస్ అన్నారు. 

లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనికి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు.