ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న రియా చక్రవర్తి ఆచూకీపై ముంబై పోలీసు కమిషనర్ వింత వాదన చేశారు. రియా చక్రవర్తి ఎక్కడుందో తెలియదని, అయితే నాలుగు విచారణకు పిలిస్తే వచ్చిందని పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చెప్పారు. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో తాము పిలిస్తే రియా చక్రవర్తి పోలీసు స్టేషన్ కు వచ్చిందని చెప్పారు. రియా చక్రవర్తి కనిపించకుండా పోయిందనే బీహార్ పోలీసుల వాదనను ఆమె తరఫున న్యాయవాది సతీష్ మనేషిండే ఖండించారు. ముంబై పోలీసులు ఆమె వాంగ్మూలం రికార్డు చేసినట్లు ఆయన తెలిపారు. పోలీసులకు ఆమె సహకరిస్తోందని అన్నారు. 

Also Read: సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే.. డెడ్ బాడీ మీద కీలక ఆధారాలు!

బీహార్ పోలీసుల నుంచి సమన్లు గానీ నోటీసులు గానీ అందలేదని ఆ.న చెప్పారు. కేసును దర్యాప్తు బీహార్ పోలీసుల పరిధిలోకి రాదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో ప్రొసీడింగ్స్ ఫైల్ చేసిందని, కేసును ముంబైకి బదిలీ చేయాలని కోరిందని, కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని ఆయన అన్నారు. 

సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు పాట్నాలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, సుశాంత్ ఆత్మహత్య కేసును విచారిస్తున్న ఐపిఎస్ అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ చేశారని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆరోపించారు. ముంబై నగరపాలక సంస్థ అధికారులు బలవంతంగా ఆయనను క్వారంటైన్ కు పంపించారని బీహార్ డీజీపీ ఆదివారంనాడు ఆరోపించారు. 

Also Read: 90 రోజుల్లో 3 కోట్లు ఖర్చు పెట్టిన సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌.. ఎందుకోసమంటే!

సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు విచారణకు బీహార్ పోలీసు బృందం ముంబై వెళ్లింది. ఐపిఎస్ అధికారి వినయ్ తివారీ ముంబై వెళ్లాడని, సుశాంత్ ఆత్మహత్య కేసును విచారించడానికి తివారీ తన జట్టుతో ముంబై వెళ్లాడని, అయితే బొంబాయి నగర పాలక సంస్థ అధికారులు తివారీని రాత్రి 11 గంటలకు క్వారంటైన్ కు పంపించారని ఆయన వివరించారు. 

తాము విజ్ఢప్తి చేసినప్పటికీ ఐపిఎస్ మెస్ లో తివారీకి వసతి కల్పించలేదని, గోరేగావ్ అతిథి గృహంలో ఉంటున్నారని పాండే చెప్పారు. రియా చక్రవర్తి పేరును ప్రస్తావిస్తూ తన కుమారుడి ఆత్మహత్యపై సుశాంత్ తండ్రి పాట్నా పోలీసులకు ఫిర్యాదు ేచశారు తివారీ నేతృత్వంలో పాట్నా పోలీసులు సుశాంత్ ఆత్మహత్యపై విచారణ చేయడానికి సిద్ధపడ్డారు. 

సుశాంత్ ఆత్మహత్యపై ముంబై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 40 మంది వాంగ్మూలాలు సేకరించారు. సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా రికార్డు చేశారు .