వైసిపి నేత, ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన గురించి రాజకీయంగా చాలా చర్చ జరుగుతోంది. రఘురామకృష్ణం రాజు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదలా పక్కన పెడితే రఘురామకృష్ణంరాజు ఇటు చిత్ర పరిశ్రమలో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నారు. 

కొన్నిరోజుల క్రితం రఘురామకృష్ణం రాజు.. సీనియర్ నటుడు కృష్ణంరాజు బర్త్ డే సెలెబ్రేషన్స్ కు హాజరు కావడం, ప్రభాస్ తో సన్నిహితంగా మెలగడం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ఆదివారంరోజు  ఆయన రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రఘురామకృష్ణం రాజు చమత్కారంగా మాట్లాడారు. 

హీరోయిన్లని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యాంకర్ సుమ రఘురామకృష్ణం రాజుకు మైక్ అందిస్తూ.. నలుగురు హీరోయిన్లు ఉన్నారు.. ఈ సెటప్ అంతా ఎలా అనిపిస్తోంది అని ప్రశ్నించింది. ఏమీ అనిపించడం లేదు కానీ.. నలుగురు హీరోయిన్ల పక్కన నేనుంటే బావుండేది అనిపిస్తోంది అని అన్నారు. దీనితో అక్కడ నవ్వులు విరిశాయి. రాశి ఖన్నా అయితే పగలపడి నవ్వేసింది. ఆయన కామెంట్స్ ని పక్కనే ఉన్న ఇజబెల్లాకు వివరించింది. 

ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు చిత్ర యూనిట్ కి శుభకాంక్షలు తెలియజేశారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో ఫేమస్ లవర్. ఈ చిత్రంతో నిజంగానే వరల్డ్ ఫేమస్ అయిపోవాలి అని అన్నారు. 

అక్రమ సంతానం, ఆమె సెక్సిస్ట్, పతివ్రత అని నిరూపించుకో.. హీరోయిన్లపై దారుణంగా..

గత సార్వత్రిక ఎన్నికల్లో రఘురామకృష్ణం రాజు నరసాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. చిత్ర పరిశ్రమతో ఆయన సన్నిహిత సంబంధాలు మైంటైన్ చేస్తున్నారు. ఆదివారం రోజు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్ర ప్రీరిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. 

'జాను'కి యంగ్ అల్లూరి ఫిదా.. సమంత, శర్వాపై రామ్ చరణ్ ప్రశంసలు!