సమంత అక్కినేని, శర్వానంద్ జంటగా నటించిన చిత్రం జాను. తమిళంలో ఘనవిజయం సాధించిన 96 చిత్రానికి ఇది రీమేక్. శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాను చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఒరిజినల్ వర్షన్ ని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ దర్శత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. 

తాజాగా జాను చిత్రంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. జాను చిత్రాన్ని చూసిన అనంతరం రామ్ చరణ్ సోషల్ మీడియాలో స్పందించాడు. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన దక్కించుకున్న చిత్రాన్ని రీమేక్ చేయడం అంత సులువైన విషయం కాదు. 

కానీ సమంత, శర్వానంద్ కష్టపడకుండా అద్భుతమైన నటన కనబరిచారు. దిల్ రాజు, శర్వానంద్, సమంత, ప్రేమ్ కుమార్ లకు శుభాకంక్షలు అని రాంచరణ్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలకు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు సమంత బ్రాండ్ గా మారిపోయింది. 

నమ్రత టైట్ హగ్.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న మహేష్!

గత కొన్నేళ్లుగా సమంత నుంచి మహానటి, రంగస్థలం, ఓ బేబీ, మజిలీ లాంటి అద్భుతమైన చిత్రాలు వస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి జాను చిత్రం చేరింది. ఇక శర్వానంద్ కు జాను చిత్రం ఊరటనిచ్చే విజయాన్ని అందించింది. అంతకు ముందు శర్వానంద్ నటించిన పడిపడి లేచే మనసు, రణరంగం లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. 

ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర ఉద్యమనేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.