సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తరచుగా సినీ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన దాదాపు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ టాలీవుడ్ ని ప్రోత్సహిస్తున్నారు. టాలీవుడ్ లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా తలసాని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 

తాజాగా మంత్రి తలసాని మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిరంజీవి నివాసంలో ఈ భేటీ జరిగింది. వీరి మధ్య ప్రధానంగా నంది అవార్డులు, సినీ కార్మికుల సమస్య, చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చ జరిగింది. టాలీవుడ్ లో నంది అవార్డులపై ఇప్పటికే అనేక వివాదాలు నెలకొని ఉన్నాయి.  

నాగబాబుకు షాకిచ్చిన ఆటో రాంప్రసాద్.. జబర్దస్త్ వదిలేయడంపై..

ఇవి కాకుండా చిరు, నాగార్జునతో తలసాని మరో ముఖ్యమైన సమస్యని కూడా ప్రస్తావించారు. పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పుడు థియేటర్ల సమస్య అధికంగా ఉంటోందని, దీనివల్ల చిన్న చిత్రాలకు ఇబ్బంది ఏర్పడుతోందని తలసాని అన్నారు. మా అసోసియేషన్ లో గొడవలు, చిత్రపురి కాలనీలో వివాదాలు ఇలా టాలీవుడ్ లో అనేక సమస్యలు ఉన్నాయి. 

పిక్ టాక్: ఎదపై పూనమ్ కౌర్ టాటూ.. మతి పోగొట్టే హాట్ నెస్

ఇవన్నీ చిరు, నాగ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య చర్చకు వచ్చి ఉండవచ్చు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి చేరుకోవాలని ఈ సంధర్భంగా తలసాని ఆశించారు.