తెలుగులో జబర్దస్త్ పాపులర్ కామెడీ షో. గత ఏడేళ్లుగా జబర్దస్త్ షో బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తోంది. జబర్దస్త్ షో ఆరంభం నుంచి మెగా బ్రదర్ నాగబాబు, నటి రోజా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరూ ఆ పొజిషన్ లో బాగా సెట్ అయిపోయారు. జబర్దస్త్ టీంతో వారికి మంచి ఎమోషనల్ అటాచ్ మెంట్ కూడా ఏర్పడింది. 

ఇటీవల జబర్దస్త్ యాజమాన్యంతో నాగబాబుకు విభేదాలు ఏర్పడ్డాయి. దీనితో నాగబాబు జబర్దస్త్ షో నుంచి బయటకొచ్చేశారు. ఓ ప్రముఖ ఛానల్ లో నాగబాబు అదిరింది అనే సరికొత్త కామెడీ షోని ప్రారంభించారు. ఈ షోకు నాగబాబే న్యాయ నిర్ణేత. ఇదిలా ఉండగా నాగబాబుతో పాటు మరికొందరు జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా వెళ్లిపోతున్నారని వార్తలు వచ్చాయి. 

ఈ విషయంపై జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను 'త్రీమంకీస్' చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. 

పిక్ టాక్: ఎదపై పూనమ్ కౌర్ టాటూ.. మతి పోగొట్టే హాట్ నెస్

జబర్దస్త్ కు పోటీగా చాలా షోలు వస్తున్నాయి.. జబర్దస్త్ ని వదిలేసే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా ఆటో ప్రసాద్ స్పందించాడు. జబర్దస్త్ షోతో వచ్చే గుర్తింపు మరే ఇతర షో చేసినా రాదు. జబర్దస్త్ ఓ మ్యాజిక్. కొత్తగా వస్తున్న షోలు ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలంటే కష్టం. అందుకే నేను ఇతర షోలకు వెళ్ళలేదు. నాతో పాటు సుడిగాలి సుధీర్.. గెటప్ శ్రీను కూడా ఈ షోని విడిచిపెట్టరు అని ఆటో రాంప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. 

చాణక్యుడు, తెనాలి రామకృష్ణుడు.. పవన్ కళ్యాణ్ పాత్రలో ఆ ఇద్దరు

ఆటో రాంప్రసాద్ సమాధానం ఒకరకంగా నాగబాబుకు షాకిచ్చే అంశమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. జబర్దస్త్ లో నాగబాబుతో క్లోజ్ గ మూవ్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ గ్యాంగ్ కూడా ఒకరు.