ఇటీవల జరిగిన శంషాబాద్ డాక్టర్ ఘటనపై టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని వర్గాల సినీ తారలు వారి ఆవేశాన్ని బాధను చూపిస్తున్నారు. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ కూడా సోషల్ మీడియా ద్వారా ఘటనపై స్పందించారు. అలాగే కొంతమంది నెటిజన్స్ చేసిన మరొక కామెంట్ కి అందరు ఆలోచించేలా మెగా హీరో ఉదాహరణ ఇచ్చారు.

ప్రతిరోజు పండగే సినిమాలో కొన్ని పోస్టర్స్ ని రిలీజ్ చేయగా.. అందులో హీరోయిన్ పై హీరో చేయి వేసి ఉండడంతో కొంతమంది హాథ్ నికలో - చెయ్ తియ్ అన్నారు. ఇదే విషయంపై స్పందించిన సాయి ధరమ్ తేజ్.. సినిమా అని తెలిసి కూడా ఇలా కామెంట్ చేస్తున్నారు. అందరు ఇలానే మన తోటి అమ్మయిల గురించి కూడా ఆలోచిస్తే.. తెలంగాణ నిర్భయ లాంటి ఘటన మన సొసైటీలో జరగవు కదా అని వివరణ ఇచ్చారు.

 

read also: ప్రియాంక హత్య: ఆమె 100కి ఎందుకు కాల్ చేయలేదంటే.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్!

తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రియాంక హత్య ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమానికిఅతిథిగా హాజరైన సుకుమార్ ప్రియాంక హత్య సంఘటనపై స్పందించారు. 

సుకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధని కలిగిస్తున్నాయి. ప్రియాంకని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఎవరికైనా కన్నీరు ఆగవు. సంబంధంలేని వారు కూడా ప్రియాంక సంఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . !

ప్రస్తుతం ఉన్న సమాజాన్ని చూస్తుంటే.. పిల్లలని ఎలా పెంచాలనే భయం వేస్తోంది. క్రిమినల్స్ అందరూ మనలో నుంచే వస్తారు. ఈ సంఘటనకు మనం కూడా ఓ రకంగా భాద్యులమే. మొబైల్, ఇంటర్నెట్ ఎక్కడ చూసినా పోర్న్ సైట్స్ ఎక్కువైపోయాయి. గతంలో సమాజం ఇంత దారుణంగా లేదు. 

ప్రియాంక కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు ప్రియాంక 100కి కాల్ చేసి ఉంటే బావుండేది అని అంటున్నారు. నేను కూడా దీని గురించి ఆలోచించా. ఆమె 100కి ఎందుకు కాల్ చేయలేదు అని ఆలోచించగా.. ప్రియాంక మాటలు వింటే చాలా సున్నితమైన అమ్మాయి అని తెలుస్తోంది. 

దోషులు మొదట ఆమెకు సాయం చేస్తామని నమ్మించారు. ఒక వేళ నేను 100కి కాల్ చేస్తే.. వాళ్ళు నిజంగానే నాకు సాయం చేసే మనసుతో ఉన్నారేమో.. నీకు సాయం చేయడానికి వస్తే పోలీసులకు అప్పగించావేంటి అని అంటారేమో.. అని ఆ సమయంలో ప్రియాంక అనుకొని ఉంటుంది. 

అమ్మాయిలు.. అబ్బాయిలని ఏదో ఒక సమయంలో నమ్మేస్తారు. మేము మగాళ్ళం కాదు మృగాలం. దయచేసి అమ్మాయిలు ఎవరూ అబ్బాయిలని నమ్మకండి. సొంత తండ్రి, అన్న, తమ్ముడిని కూడా నమ్మొద్దు. ప్రస్తుతం సమాజం అలా ఉంది. 100కి కాల్ చేయాలని అనిపిస్తే చేసేయండి.. తర్వాత సారీ చెప్పొచ్చు. మీరు మమ్మల్ని నమ్మకపోవడమే బెటర్ అని సుకుమార్ వేదికపై వ్యాఖ్యానించారు.