మంచువారి అబ్బాయి మనోజ్ కెరీర్ లో లాంగ్ గ్యాప్ ఏర్పడింది. మనోజ్ చివరిగా 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు చిత్రంలో నటించాడు. వరుస పరాజయాలు, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకుల కారణంగా ఈ గ్యాప్ ఏర్పడింది. తిరిగి వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు మనోజ్ రెడీ అవుతున్నాడు. 

ఇటీవలే మనోజ్ తన కొత్త చిత్ర టైటిల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. విభిన్నమైన కాన్సెప్ట్ తో 'అహం బ్రహ్మాస్మి' అనే చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ దర్శత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో మనోజ్ కి జోడిగా తమిళ నటి, యాంకర్ అయిన ప్రియా భవాని శంకర్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

పవన్ కోసం చిరంజీవి డైలాగ్.. మరోసారి నితిన్ అభిమానం.. భీష్మ స్టోరీ రివీల్!

తమిళంలో ప్రియా భవాని శంకర్ నటిగా, యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి చిత్రానికి కొత్త హీరోయిన్ అయితే బావుంటుందని చిత్ర దర్శకుడు భావిస్తున్నాడు. ప్రియా భవాని తెలుగులో ఇంతవరకు నటించలేదు. దీనితో ప్రియా భవానితో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

అల్లు అరవింద్ చేయి పడితే ఇక అంతే.. ఈ హీరోల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్

ప్రస్తుతం ప్రియా భవాని తమిళంలో శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2లో నటిస్తోంది. మంచు మనోజ్ నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కానీ సక్సెస్ రేట్ తక్కువ. సోషల్ మీడియాలో సామజిక అంశాలపై తరచుగా స్పందిస్తూ అభిమానుల నుంచి ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. మనోజ్ రీ ఎంట్రీ చిత్రంపై టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది.