కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. సినిమాల్లోకి వచ్చాక ఆయన మోహన్ బాబు అయ్యారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ రోల్స్ లో దశాబ్దాల కాలంగా మోహన్ బాబు విలక్షణమైన నటనతో అలరిస్తున్నారు. మోహన్ బాబు చాలా ఏళ్ల తర్వాత నటిస్తున్న తమిళ చిత్రం ఆకాశమే నీ హద్దురా. 

సుధాకొంగర దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నాడు. సామాన్యులకు సైతం విమానయాన సౌకర్యం అందుబాటులోకి తెచ్చిన కెప్టెన్ గోపీనాధ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల ఈచిత్రంలో మోహన్ బాబు పాత్రకు సంబంధించిన స్టిల్స్ విడుదలయ్యాయి. 

అక్కడ సెక్స్ సీన్లు ఇక్కడ వద్దు.. నితిన్ భయం అదే!

ఈ స్టిల్స్ లో మోహన్ బాబు విమానయాన సంస్థలో పనిచేసే వ్యక్తిగా యూనిఫామ్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్ర పేరు భక్తవత్సలం నాయుడు. మోహన్ బాబు అసలు పేరు కూడా అదే. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ షాకయ్యారు. 

బిగ్ బాస్ కౌశల్ ఎమోషనల్ పోస్ట్.. 'నా భార్య కల నెరవేరబోతోంది'!

మోహన్ బాబు రోల్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. 'ఓహ్ నాన్న తన పుట్టిన పేరుతో నటిస్తున్నారా.. నాకు తెలియదే. యూనిఫామ్ లో నాన్న ఎంతో హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఆయన ఒక అద్భుతం' అని మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది. ఆకాశమే నీహద్దురా చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి సూర్యకి హీరోయిన్ గా నటిస్తోంది.