బాలీవుడ్ క్రేజీ హీరో టైగర్ ష్రాఫ్ నుంచి రాబోతున్న మరో మాస్ మసాలా ఎంటర్టైనర్ భాగీ 3. భాగీ సిరీస్ లో భాగంగా టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్ మరోసారి జంటగా నటించారు. ఈచిత్రం అహ్మద్ ఖాన్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. షాజిద్ నడియావాలా ఈ చిత్రానికి నిర్మాత. గత ఏడాది శ్రద్దా కపూర్ ప్రభాస్ సరసన సాహోలో నటించింది. ఆ చిత్ర రిజల్ట్ పక్కన పెడితే.. శ్రద్దా కపూర్ కు సాహో ద్వారా సౌత్ లో క్రేజ్ ఏర్పడింది. 

యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా చిత్రీకరించిన భాగీ 3 చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 6న రిలీజ్ చేస్తున్నారు. దీనితో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలో టైగర్ అదరగొట్టేశాడు. ఇక శ్రద్దా కపూర్ గ్లామర్ ఒలకబోస్తూ కుర్రకారుని ఆకర్షిస్తోంది. 

ఈ చిత్రంలో 'దస్ బహానా' అనే సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ వీడియో సాంగ్ ని కొంత భాగం యూట్యూబ్ లో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్ తమ డాన్స్ మూమెంట్స్ తో మతిపోగొడుతున్నారు. 

హీరోయిన్ల చెంపలు పగిలేలా కొడతారు.. ముద్దులు పెట్టించుకున్నా సైలెంట్ గానే..

అందరిని ఆకట్టుకుంటున్న ఆ పాట చిత్రీకరణ అంత సులభంగా ఏమీ జరగలేదు. ఈ సాంగ్ చిత్రకరణ కోసం చిత్ర యూనిట్ ఎంతగానో శ్రమించింది. దాదాపు 300 మంది డాన్సర్లతో ప్రతికూల పరిస్థితుల్లో ఈ సాంగ్ షూట్ చేశారు. 

భీష్మ సక్సెస్ మీట్: నితిన్, రష్మిక రచ్చ చూశారా (ఫొటోస్)

ఎముకలు కొరికే చలి ఉన్నపటికీ శ్రద్దా కపూర్ బికినిలో, టైగర్ ష్రాఫ్ షర్ట్ లేకుండా డాన్స్ చేశారు. తాజాగా విడుదుల చేసిన ఈ సాంగ్ మేకింగ్ వీడియో అబ్భురపరిచే విధంగా ఉంది. మీరూ ఓ లుక్కేయండి.