అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కించిన చిత్రం “పుష్ప ది రైజ్”. డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లాస్ట్ భారీ సినిమా “పుష్ప ది రైజ్” తెలుగులో బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచిన సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ రోజు కాస్త డివైడ్ టాక్ తెచ్చుకున్నా...దానితో సంబంధం లేకుండా కలెక్షన్స్ వర్షం కురిసింది. ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం ఒక్క బన్నీ కె చెల్లుతుంది అని పుష్ప మరోసారి ప్రూవ్ చేసింది. అలాగే ఈ సినిమాకు హిందీ లో కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ సినిమాని చూసిన స్టార్స్ తమ స్పందనను తెలియజేసారు. ఇప్పుడు అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... పుష్ప సినిమా చూసాక కీలక కామెంట్స్ చేసాడు.
పుష్ప పాత్రలో అల్లు అర్జున్ చాలా అద్భుతంగా నటించాడని, సుకుమార్ తన సినిమాని పల్లెటూరి వాతావరణంలోనే చూపిస్తూ నిజాయితీతో, క్లాస్ వేరుగా ఉండేలా మరోసారి రుజువు చేశాడని, ఇక దేవిశ్రీ ప్రసాద్ గురుంచి నేను ఏమి చెప్పగలనని.. నువ్వు నిజంగా రాక్ స్టార్ అని కొనియాడాడు. మైత్రి మూవీ మేకర్స్ మరియు మొత్తం టీమ్‌కి అభినందనలు తెలుపుతున్నానని, మీ గురించి నిజంగా గర్వంగా ఉంది అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.
అలాగే బిగ్ బాస్ హిందీ రన్నర్ గా నిలిచిన అలీ గోని పుష్ప సినిమా చూసాక ఒకటే అనిపించింది. మన సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఉండే ఎడిటింగ్ గాని, డైరెక్షన్ గాని అలాగే నటన కానీ ఎవరూ చెయ్యలేరని మైండ్ బ్లోయింగ్ డైలాగ్స్, అదిరిపోయే స్క్రీన్ ప్లే పుష్ప చూసి మజా వచ్చింది అని అంటూ తన రెస్పాన్స్ ని తెలియజేసాడు.
పుష్ప సినిమా డిసెంబర్ 17న విడుదలైన సంగతి తెలిసిందే. ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత బన్నీ, సుకుమార్ ల కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాకు మొదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికి ఆప్రభావం సినిమా కలెక్షన్ పై మాత్రం పడలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవిలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కించాడు దర్శకుడు సుకుమార్.
Also Read : Prabhas Visited Sirivennela Home: సిరివెన్నెల కుటుంబాన్ని పరామర్శించిన ప్రభాస్.. స్వయంగా ఇంటికి వెళ్లి..
‘పుష్ప: ది రైజ్’ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. కథ మొదలైన దగ్గరి నుంచి పుష్పరాజ్ పాత్రను ఎలివేట్ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. మాస్ లుక్‌లోనే కాదు నటనలోనూ అల్లు అర్జున్ అదరగొట్టేశాడు. ఏ సన్నివేశం చూసిన ‘తగ్గేదేలే’ అంటూ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించాడు. చిత్తూరు యాస్‌లో బన్ని పలికిన సంభాషణలు అలరిస్తాయి. శ్రీవల్లిగా డీగ్లామర్ పాత్రలో రష్మిక నటన సహజంగా ఉంది. రష్మిక హీరోయిన్. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
Also Read : రియల్ హీరో సోనూసూద్ ఖాతాలో మరో సేవ.. వెయ్యి మంది విద్యార్థినీలకు సైకిళ్ల పంపిణీ..
