సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అవుతోంది. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ప్యాకేజ్ గా తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. నేరుగా మహేష్ బాబు రంగంలోకి దిగి టివి ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయాడు. ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు, రష్మిక మందన పాల్గొన్నారు. 

యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు మహేష్ బాబు కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. అనిల్ రావిపూడి వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఈ చిత్రాన్ని అంగీకరించే ముందు ఆయన సక్సెస్ ని పరిగణలోకి తీసుకున్నారా అని యాంకర్ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు గతంలోనే సమాధానం ఇచ్చా.. మీరు నన్ను అర్థం చేసుకోలేదు. నాకు కథ నచ్చితేనే సినిమా చేస్తా.. లేకుంటే చేయను. దర్శకుల సక్సెస్,ఫెయిల్యూర్ ని దృష్టిలో పెట్టుకోను అని మహేష్ తెలిపాడు. 

యుఎస్ లో బన్నీ, మహేష్ వార్.. ఇద్దరికీ బిగ్ టార్గెట్!

గతంలోనే అనిల్ రావిపూడి ఏ కథని వినిపించారు. ఆయన 45 నిమిషాల పాటు ఇచ్చిన నేరేషన్ లో కథ చాలా బాగా నచ్చింది. కానీ ఆ సమయంలో నాకు వేరే కమిట్మెంట్ ఉంది. తర్వాత చేస్తానని చెప్పా. అనిల్ కూడా తాను మరో సినిమా పూర్తి చేసిన తర్వాత చేస్తానని అన్నాడు. అలాంటి తరుణంలో ఎఫ్2 చిత్రం వచ్చింది. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ఇదే పర్ఫెక్ట్ టైం అని భావించాం. వెంటనే సెట్స్ పైకి వెళ్లడం.. షూటింగ్ పూర్తి కావడం జరిగిపోయిందని మహేష్ తెలిపాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రం నా కెరీర్ లో బెస్ట్ డెసిషన్స్ లో ఒకటి అని మహేష్ బాబు అన్నారు. 

ఎన్టీఆర్ మూవీకి ఒప్పుకుంది అందుకే.. 'దర్బార్'లో హైలైట్ అదే: నివేత