సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గురువారం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏఆర్ మురుగదాస్, రజనీ కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నయనతార ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. 

ఇక జైలవకుశ, నిన్నుకోరి, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలతో నివేత థామస్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అద్భుతమైన నటిగా నివేతకు మార్కులు పడ్డాయి. వరుసగా నివేతకు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. రజనీకాంత్ తో కలసి తొలిసారి నటించిన అనుభవాన్ని నివేత ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. 

వరుసగా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్స్ చేయడం.. కమర్షియల్ చిత్రాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై నివేత స్పందించింది. కమర్షియల్ చిత్రాలంటే నాకు కూడా ఇష్టమే. అందుకే ఎన్టీఆర్ జైలవకుశ చిత్రంలో నటించా. ఆ చిత్రంతో నేను తెలుగులో మాస్ ఆడియన్స్ కు చేరువయ్యాను. సెలక్టివ్ గా కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఒకేసారి ఐదారు చిత్రాల్లో నటించాలనే కోరిక లేదని నివేత తెలిపింది. 

దర్బార్ చిత్రంలో నటించడం గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించే వరకు రజనీ సర్ ని కలవలేదు. సెట్స్ లోని ఆయన్ని తొలిసారి కలిశాను. ఈ చిత్రంలో ఆయన కుమార్తె పాత్రలో నటించాను. సెట్స్ లో ఆయన్ని ఆదిత్య అరుణాచలంగా చూశా. మేమిద్దరం పూర్తిగా తండ్రీ కూతుళ్లుగా మారిపోయాం. దాదాపు 45 రోజులు దర్బార్ షూటింగ్ లో పాల్గొన్నా. షూటింగ్ చివరి రోజు మాత్రమే నేను నటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో అని రియలైజ్ అయ్యా. 

రొమాంటిక్ హీరోకి విలన్ గా అరవింద్ స్వామి!

రజనీ సూపర్ స్టార్ అని మనందరికీ తెలుసు.. కానీ సెట్స్ లో ఆయన చాలా సాధారణమైన వ్యక్తిలా ఉంటారు. అందరితో కలిసిపోతారు. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాల మ్యాజిక్ ని మీరంతా సినిమాలో చూస్తారు. తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్ ఈ చిత్రంలో బాగా పండింది అని నివేత తెలిపింది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. 

క్రేజీ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి.. అనారోగ్యమా?