Asianet News TeluguAsianet News Telugu

యుఎస్ లో బన్నీ, మహేష్ వార్.. ఇద్దరికీ బిగ్ టార్గెట్!

ప్రస్తుతం సినీ అభిమానుల అందరి దృష్టి సంక్రాంతికి విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలపైనే ఉంది. ఇద్దరు బడా హీరోల చిత్రాలు విడుదల కాబోతుండడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఎలా ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది.

Big target for allu arjun and mahesh in US
Author
Hyderabad, First Published Jan 8, 2020, 4:41 PM IST

ప్రస్తుతం సినీ అభిమానుల అందరి దృష్టి సంక్రాంతికి విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలపైనే ఉంది. ఇద్దరు బడా హీరోల చిత్రాలు విడుదల కాబోతుండడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఎలా ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది. తెలుగు సినిమాకు యుఎస్ ఆడియన్స్ రూపంలో పెద్ద మార్కెట్ ఉంది. 

మహేష్, అల్లు అర్జున్ ఇద్దరికీ యుఎస్ లో మంచి మార్కెట్ ఉంది. ఇక ఓవర్సీస్ లో త్రివిక్రమ్ చిత్రాలు ఒక బ్రాండ్. త్రివిక్రమ్ తెరకెక్కించే చిత్రాలు ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ల వసూళ్లు కురిపిస్తుంటాయి. వరుస విజయాలతో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా యుఎస్ లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్నాడు. 

ఈ తరుణంలో యుఎస్ లో ఈ రెండు చిత్రాల ప్రీరిలీజ్ బిజినెస్ ఎలా ఉందో చూద్దాం. సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సంస్థ విడుదల చేస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్ర ఓవర్సీస్ హక్కులు దాదాపు 12 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. యుఎస్ లో మాత్రమే ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు 9 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. 

యుఎస్ లో సరిలేరు నీకెవ్వరు చిత్రం హిట్ అనిపించుకోవాలంటే కనీసం 2.8 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది. అంటే భరత్ అనే నేను చిత్రం కంటే ఈ మూవీఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. మహేష్ చిత్రాలకు యూఎస్ లో మంచి మార్కెట్ ఉంది కాబట్టి.. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి హిట్ టాక్ వస్తే సులువుగా 3 మిలియన్ల మార్క్ ని అందుకుంటుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 

ఎన్టీఆర్ మూవీకి ఒప్పుకుంది అందుకే.. 'దర్బార్'లో హైలైట్ అదే: నివేత

ఇక అల వైకుంఠపురములో చిత్ర యుఎస్ వసూళ్లు అల్లు అర్జున్ క్రేజ్ తో పాటు త్రివిక్రమ్ బ్రాండ్ పై కూడా ఆధారపడి ఉన్నాయి. అల వైకుంఠపురములో చిత్రానికి యుఎస్ లో 9 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఈ చిత్రం 2 మిలియన్ల వరకు వసూలు చేయాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios