అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. గీతాఆర్ట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కనుంది. ప్రస్తుతం 'అల.. వైకుంఠపురంలో' సినిమా షూటింగ్ తో బిజీగా గడుపుతోన్న అల్లు అర్జున్ త్వరలోనే సుకుమార్ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు.

అయితే ఈలోగా సుక్కు కొన్ని సీన్లను సైలెంట్ గా పూర్తి చేసినట్లు సమాచారం. కేరళలోని దట్టమైన అడవుల మధ్య ఓ జలపాతం నేపధ్యంలో ఓ సన్నివేశాన్ని రూపొందించాడట. బన్నీ లేకుండానే ఈ సీన్స్ ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. బన్నీఫై బ్లూమ్యాట్ లో షాట్ తీసి, దాన్ని సీజీ సహాయంతో కవర్ చేస్తారట.

'మత్తు వదలరా' రివ్యూ!

పీటర్ హెయిన్స్ ఈ సన్నివేశానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించాడు. 'బాహుబలి'లో జలపాతం సీన్ కి విపరీతమైన స్పందన వచ్చింది. తెలుగు సినిమాలో జలపాతం సీన్ అంటే బాహుబలి సినిమానే గుర్తొస్తుంది. ఆ రేంజ్ కి ఎంతమాత్రం తగ్గకుండా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారట.

బన్నీ ఇంట్రడక్షన్ సీన్స్ లో ఈ జలపాతం కనిపించనుందట. కొన్నిరోజుల క్రితమే హీరో చిన్నప్పటి ఎపిసోడ్ లను పూర్తి చేశాడట సుకుమార్. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ బాగా గెడ్డం పెంచబోతున్నాడని తెలుస్తోంది.

తన బరువు కూడా పెంచుకోవాల్సివస్తోంది. దీనికోసం బన్నీ కొంత సమయం తీసుకుంటాడు. ఈలోగా బన్నీ అవసరం లేని సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసే పనిలో పడ్డాడు సుకుమార్.