హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'మా' ఉపాధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. నేడు మా డైరీ లాంచ్ కార్యక్రమంలో జరిగిన పరిణామాల కారణంగా రాజశేఖర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ లో రాజశేఖర్ ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నారు. టాలీవుడ్ యాంగ్రీ మెన్ గా రాజశేఖర్ కు గుర్తింపు ఉంది. 

చాలా కాలం పాటు రాజశేఖర్ కు సరైన సక్సెస్ లేదు. 2017లో విడుదలైన గరుడవేగ చిత్రంతో రాజశేఖర్ పూర్వ వైభవాన్ని దక్కించుకున్నారు. ఆ చిత్రం తర్వాత రాజశేఖర్ దంపతులు తెలుగు చిత్ర పరిశ్రమ కార్యమ్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత ఏడాది జరిగిన మా ఎన్నికల్లో రాజశేఖర్ నరేష్ ప్యానల్ తరుపున పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

రాజశేఖర్ తో గొడవ.. మోహన్ బాబుని ముద్దాడిన చిరు!

నరేష్ మా అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత మాలో పరిస్థితి సరిగ్గా లేదు. తరచుగా విభేదాలు తెరపైకి వస్తున్నాయి. రాజశేఖర్ దంపతులు, నరేష్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కాగా నేడు సినీ పెద్దల ఆధ్వర్యంలో మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

చిరు వర్సెస్ రాజశేఖర్.. జీవిత సర్దుబాటు ఆరాటం!

ఈ కార్యక్రమానికి చిరంజీవి, మోహన్ బాబు, టి సుబ్బనిరామిరెడ్డి, కృష్ణం రాజు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం మా అసోసియేషన్ లో జరుగుతున్న పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ఎన్ని వివాదాలు ఉన్నా మా అసోసియేషన్ మొత్తం ఒక కుటుంబంలా వ్యవహరించి సద్దుకుపోవాలని చిరంజీవి సూచించారు. 

మెగాస్టార్ vs రాజశేఖర్ ఫైట్: రాజశేఖర్ పై చర్యలు తీసుకుంటాం: నరేష్

ఈ వ్యవహారంలో రాజశేఖర్ చిరంజీవితో విభేదించారు. చిరంజీవి మాట్లాడుతుండగా రాజశేఖర్ తన అభిప్రాయాలు చెబుతూ అడ్డు తగిలారు. రాజశేఖర్ తీరుతో చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. అలాగే మోహన్ బాబు కూడా రాజశేఖర్ తీరుని తప్పుబట్టారు. ఇలా సినీ పెద్దల ముందు రాజశేఖర్ ఏకాకిలా మారిపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. 

మైక్ లాగేసుకొని చిరుతో గొడవకి దిగిన రాజశేఖర్!

నేడు జరిగిన పరిణామాలతో రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకు మా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సినీ పెద్దలు రాజశేఖర్ ని బుజ్జగించే ప్రయత్నం చేస్తారా.. రాజశేఖర్ తన రాజీనామాని ఉపసంహరించుకుంటారా అనేది వేచి చూడాలి. 

నాకు విలువలేదు, రాజశేఖర్ ప్లాన్ ఇది.. మండిపడ్డ చిరంజీవి!