బాలీవుడ్ భామ కృతి కర్బందా ప్రస్తుతం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ లో వరుస చిత్రాలతో దూసుకు పోతోంది. కృతి కర్బందా 2009లో సుమంత్ నటించిన బోణి చిత్రంతో  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశపరచడంతో కృతికి గుర్తింపు దక్కలేదు. 

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన తీన్ మార్ చిత్రంలో నటించినా కలసి రాలేదు. ఇటీవల కృతి కర్బందాకు బాలీవుడ్ లో అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కృతి కర్బందా హౌస్ ఫుల్ 4 చిత్రంలో నటించి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విడుదలైన పాగల్ పంతి చిత్రంలో కూడా కృతి నటించింది. 

ఈ మూవీలో కృతి కర్బందా ప్రియుడు పుల్కిట్ సామ్రాట్ కూడా నటించాడు. కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలని నిజం చేస్తూ తాను పుల్కిట్ ని ప్రేమిస్తున్నట్లు కృతి కర్బందా మీడియా ముందు రివీల్ చేసింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💖💖💖

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) on Dec 17, 2019 at 7:50pm PST

తాజాగా పుల్కిట్ సామ్రాట్ తో రొమాన్స్ చేస్తున్న దృశ్యాలని కృతి కర్బందా సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరిద్దరి రొమాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో బీచ్ లో విహరిస్తున్నారు. ఓ మ్యారేజ్ కు వీరిద్దరూ జంటగా హాజరయ్యారట. అందుకే సాంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తున్నారు.

టైమ్ బాంబ్ ఆన్ అయింది.. పవన్ కళ్యాణ్ పై సాయిధరమ్ తేజ్ కామెంట్స్

వీరిద్దరూ రొమాన్స్ చూసిన నెటిజన్లు.. మీ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. పుల్కిట్ సామ్రాట్ కు ఆల్రెడీ వివాహం జరిగింది. 2014లో అతడు స్వేత అనే సామజిక కార్యకర్తని వివాహం చేసుకున్నాడు. 2015లో వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం పుల్కిట్, కృతి కర్బందా ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారింది. 

25 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల విడాకులు.. హీరోయిన్ కామెంట్స్