లెజెండ్రీ ఫిలిం మేకర్ ప్రియదర్శన్, నటి లిజీ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్. కళ్యాణి హలో చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో కళ్యాణి క్యూట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత కళ్యాణి ప్రియదర్శన్ చిత్రలహరి చిత్రంతో తొలి సక్సెస్ అందుకుంది. ఆ తర్వా త కళ్యాణి రణరంగం చిత్రంలో కూడా నటించింది. 

ప్రస్తుతం ఈ యంగ్ హీరోయిన్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. క్రేజీ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న హీరో చిత్రంతో కళ్యాణి తమిళంలోకి కూడా అడుగుపెడుతోంది. ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. ఓ ఇంటర్వ్యూలో కళ్యాణి మాట్లాడుతూ తన తల్లి దండ్రులు విడాకులు తీసుకుని విడిపోవడంపై స్పందించింది. నా తల్లిదండ్రులు విడిపోవడం నాతో పాటు మా ఫ్యామిలీకి కూడా పెద్ద షాక్. కానీ మా కుటుంబంలో ప్రశాంతత, సంతోషం అలాగే ఉన్నాయని కళ్యాణి తెలిపింది. 

మా అమ్మా నాన్నా విడిపోవడం బాధ అనిపించింది కానీ కుటుంబంపై ఆ ప్రభావం పడలేదు. వారిమధ్య ఉన్న విభేదాలతో మా తల్లిదండ్రులు ఎప్పుడూ మమల్ని ఇబ్బంది పెట్టలేదు. ఆవిషయంలో వారిని ప్రశంసించాలి. ఇప్పుడు ఇంకా వారితో నా బంధం పెరిగింది అని కళ్యాణి చెప్పుకొచ్చింది. 

కార్తికేయకు మరో విలన్ రోల్ ఆఫర్.. ఈసారి స్టార్ హీరో సినిమాలో ?

ప్రియదర్శన్, నటి లిజీ 1990లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. దాదాపు 25 ఏళ్లపాటు కొనసాగిన వీరి వివాహ బంధానికి 2016లో బ్రేక్ పడింది. విభేదాల కారణంగా లిజీ, ప్రియదర్శన్ కోర్టు నుంచి విడాకులు పొందారు. కానీ ఇప్పటికి వీరిద్దరూ స్నేహంగానే ఉంటున్నారు.