సాధారణ డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి దిల్ రాజు టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ వరకు ఎదిగారు. దిల్ రాజుకు ఉండే స్టోరీ జడ్జిమెంట్, సినిమా నిర్మాణంలో పట్టు, ప్రమోషనల్ ప్లానింగ్ ఇటీవల వచ్చిన మరే నిర్మాతకు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. దిల్ రాజు మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాత. 

దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో లక్ష్మణ్ తో విభేదాలు తలెత్తినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నుంచి లక్ష్మణ్ తప్పుకున్నట్లు, కొత్తగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించబోతున్నట్లు ప్రచారం జరిగింది. దీనికి కొనసాగింపుగా మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. 

జయసుధ కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్.. చిరంజీవి, పవన్, రాజమౌళి సందడి(ఫొటోస్)

కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ చిత్ర బిజినెస్ పై కూడా ట్రేడ్ లో ఆసక్తి నెలకొంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

కొరటాల శివ దర్శకుడిగా కష్టపడుతూనే ఈ చిత్ర బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారట. చిరు 152 బిజినెస్ వ్యవహారంలో కొరటాల శివ తన సన్నిహితులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా దిల్ రాజు ఏ చిత్ర నైజాంతో పాటు ఉత్తరాంధ్ర హక్కులని కూడా సొంతం చేసుకోవాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 

'డైరెక్టర్, హీరోతో పడుకుంటే ఆఫర్ ఇస్తాం'.. స్టార్ హీరో కుమార్తె షాకింగ్ కామెంట్స్!

కానీ కొరటాల మాత్రం దిల్ రాజుకు ఝలక్ ఇచ్చారు. దిల్ రాజుకు కాకుండా నైజాం హక్కులని కొరటాల శివ లక్ష్మణ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర హక్కులని సుధాకర్అనే వ్యక్తికి కొరటాల ఇచ్చారట. దీనితో దిల్ రాజు ప్రస్తుతం కొరటాలపై కాస్త గుర్రుగా ఉన్నట్లు సమాచారం. 

ఎస్విసి సంస్థ నుంచి బయటకు వచ్చాక లక్ష్మణ్.. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో వస్తున్న చిత్ర నైజాం హక్కులని కూడా సొంతం చేసుకున్నారట.