Asianet News TeluguAsianet News Telugu

శ్రీను వైట్ల సినిమాలు అందుకే ఫ్లాప్ అవుతున్నాయి: కోన వెంకట్!

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కెరీర్ ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. ఆగడు చిత్రంతో మొదలైన శ్రీను వైట్ల పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. శ్రీను వైట్ల నీకోసం చిత్రంతో దర్శకుడిగా మారారు. శ్రీను వైట్ల దర్శత్వంలో ఆనందం, సొంతం, వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. 

Kona Venkat Comments on Sreenu Vaitla
Author
Hyderabad, First Published Jan 31, 2020, 1:03 PM IST

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కెరీర్ ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. ఆగడు చిత్రంతో మొదలైన శ్రీను వైట్ల పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. శ్రీను వైట్ల నీకోసం చిత్రంతో దర్శకుడిగా మారారు. శ్రీను వైట్ల దర్శత్వంలో ఆనందం, సొంతం, వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. 

ఇదిలా ఉండగా శ్రీను వైట్ల, రచయిత కోన వెంకట్ లది సూపర్ హిట్ కాంబో. దాదాపుగా వీరిద్దరో కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. దూకుడు తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. ఓ చిత్రానికి సంబంధించిన క్రెడిట్ విషయంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు కోన వెంకట్ ఓ సందర్భంలో తెలిపారు. 

ఎప్పుడైతే వీరిద్దరూ విడిపోయారో అప్పటి నుంచి శ్రీను వైట్లకు సక్సెస్ లేదు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోన వెంకట్ మాట్లాడారు. తాను తప్పుకోవడం వల్లే శ్రీను వైట్లకు సక్సెస్ దూరమైందనే వాదనతో తాను ఏకీభవించనని అన్నారు. శ్రీను వైట్లలో మంచి ట్యాలెంట్ ఉంది. అతడి కామెడీ టైమింగ్ చాలా బావుంటుంది. 

ఆర్టిస్ట్స్ నుంచి మంచి పెర్ఫామెన్స్ రాబట్టగలడు. కానీ ప్రస్తుతం అతడి సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణం కథల ఎంపిక అని నేను అనుకుంటున్నా. సినిమా విజయం సాధించాలంటే స్టోరీ జడ్జిమెంట్ చాలా ముఖ్యం అని కోనా వెంకట్ అన్నారు.

రిలీజ్ కు ముందే 'RRR' 200 కోట్లు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ విధ్వంసం షురూ! 

ప్రస్తుతం తాను శ్రీను వైట్లతో పనిచేయకపోవడం వల్లే ఫ్లాపులు వస్తున్నాయనడం సరికాదు. ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్ శాశ్వతం కాదు. నేను అందించిన కథలకు శ్రీను వైట్ల అద్భుతంగా దర్శత్వం చేశారు. అవే కథలు వేరే దర్శకులు చేస్తే శ్రీను వైట్ల అంత బాగా చేస్తారని అనుకోను. 

'తీన్ మార్' హీరోయిన్ క్లీవేజ్ షో.. స్టన్నింగ్ ఫొటోస్ వైరల్!

ప్రస్తుతం నాకు శ్రీను వైట్లపై ఎలాంటి కోపం లేదు అని కోన వెంకట్ అన్నారు. ఎవరితోనూ జీవితాంతం విభేదాలు ఉంచుకోకూడదు అని కోన వెంకట్ అన్నారు. భవిష్యత్తులో తాను రాసే కథకు శ్రీను వైట్ల మాత్రమే సరైన దర్శకుడు అని భావిస్తే అతడికి ఫోన్ చేస్తానని కోన వెంకట్ అన్నారు. అతడి మనసులో ఏముందో తెలియదు. నా వైపు నుంచి అయతే ప్రయత్నం చేస్తానని కోన వెంకట్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios