యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై దేశ్యవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. తెలుగు స్వాతంత్ర సమరవీరులకు సంబందించిన కథే అయినప్పటికీ.. రాజమౌళి తన విజన్ తో ఈ చిత్రాన్ని యూనివర్సల్ అప్పీల్ ఉండేలా తెరకెక్కిస్తున్నారు. 

ముందుగా ఈ చిత్రాన్ని జులై 30న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో దసరాకు వాయిదా పడిందని, తాజాగా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సినిమా రిలీజ్ విషయాన్ని పక్కన పెడితే అప్పుడే ఈ చిత్రం సంచలనాలు మొదలు పెట్టేసినట్లు తెలుస్తోంది. 

తాజా సమాచారం మేరకు ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ బిజినెస్ మొదలైపోయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కళ్ళు చెదిరేలా ఆర్ఆర్ఆర్ చిత్ర థియేట్రికల్ రైట్స్ కోసం 200 కోట్ల ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాతకు, బయ్యర్లకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణాలో 200 కోట్లు అంటే మాములు విషయం కాదు. 

ఏపీ రాజధానిగా వైజాగ్.. అనుష్క, పూరి జగన్నాధ్ పై రూమర్స్ నిజమేనా?

రాజమౌళి చివరగా తెరకెక్కించిన బాహుబలి 2 చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ 122 కోట్ల వరకు జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే బాహుబలి 2 మూవీ 203 కోట్ల షేర్ సాధించి బయ్యర్లకు లాభాల పంట పండించింది. ఆర్ ఆర్ఆర్ చిత్రం అంతకు మించి ఉంటుందనే అంచనాలతో బయ్యర్లు ఎగబడుతున్నారు. 

పవన్, ప్రభాస్ కు అవసరం.. వాళ్లకు తప్పనిసరి.. మిస్సైతే అంతే సంగతులు!

ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా జాయిన్ అయ్యాడు. రామ్ చరణ్ కు హీరోయిన్ గా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 400 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.