జనసేన అధినేత పవన్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో హాట్ టాపిక్ గా మారారు. పవన్ కళ్యాణ్ గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు సినిమాలని ఓకే చేశారు. ప్రస్తుతం పింక్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు క్రిష్ దర్శత్వంలో, హరీష్ శంకర్ దర్శత్వంలో కూడా పవన్ నటించనున్నాడు. 

ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ నిర్మాత, రచయిత కోన వెంకట్ పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కోన వెంకట్ స్పందించారు. ఎన్నికల ముందు కోన వెంకట్ పవన్ పై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. 

రకుల్ ప్రీత్ సింగ్ స్టైలిష్ అండ్ హాట్ ఫొటోస్

తాజాగా కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మంచి ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. పవన్ కళ్యాణ్ నాకు స్నేహితుడు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే పవన్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. ప్రత్యర్థులంతా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడని చేస్తున్న విమర్శలపై కోన వెంకట్ స్పందించారు. 

చాణక్యుడు, తెనాలి రామకృష్ణుడు.. పవన్ కళ్యాణ్ పాత్రలో ఆ ఇద్దరు

పవన్ గురించి తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా. అతడు అలాంటి వ్యక్తి కాదు. ప్యాకేజ్ అంటూ వస్తున్న వార్తలన్నీ నాన్ సెన్స్ అని కోన వెంకట్ అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న టీం సరైనది కాదని విమర్శించారు. పవన్ రాజకీయాల గురించి లోతుగా మాట్లాడను. కానీ అతడు ధైర్యంగా పార్టీ పెట్టాడు. మరొకరి పార్టీ లాక్కోలేదు.. మరొకరి పార్టీలోకి వెళ్ళలేదు అని కోన వెంకట్ అన్నారు. 

పిక్ టాక్: ఎదపై పూనమ్ కౌర్ టాటూ.. మతి పోగొట్టే హాట్ నెస్