సినీ ప్రియులంతా దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఎదురుచూస్తున్న చిత్రం కెజిఎఫ్ చాఫ్టర్ 2. సౌత్ స్టార్ హీరో యష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. 2018లో విడుదలైన కెజిఎఫ్ మొదటి భాగం సంచలన విజయం అందుకుంది. అన్ని భాషల్లో ఈ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 

హీరో యష్ నటన, యాక్షన్ సీన్స్, కట్టిపడేసే కథ ఇలా ప్రతి అంశం ప్రేక్షకులని మెప్పించింది. దీనితో ప్రతి ఒక్కరూ కెజిఎఫ్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ వేసవికి ఈ చిత్రం రిలీజ్ కావడం లేదని ఇదివరకే చిత్ర యూనిట్ ప్రకటించారు. తాజాగా కెజిఎఫ్ రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

'నీ కళ్ళకు అందరు అమ్మాయిలు అందంగానే ఉంటారు'.. అనుష్కపై పూరి భార్య కామెంట్స్!

దసరా ఫెస్టివల్ సీజన్ టార్గెట్ చేస్తూ.. అక్టోబర్ 23 ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కెజిఎఫ్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. 

కెజిఎఫ్ 2లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మెయిన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రవీనా టాండన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. కెజిఎఫ్ లోకి ఎంటర్ అయిన యష్.. గరుడని హతమార్చడంతో మొదటి భాగం ముగుస్తుంది. రెండవ భాగాన్ని అంతకు మించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. 

సడెన్ గా అల్లు అర్జున్ హీరోయిన్ పెళ్లి.. ఆమె భర్త ఎవరంటే!