సెలెబ్రిటీలు ఎక్కువగా ఎలాంటి హడావిడి లేకుండా వివాహం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. గతంలో పలువురు సినీతారల వివాహాలు కేవలం కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ప్రైవేట్ వేడుకగా వివాహం చేసుకున్నారు. తాజాగా హీరోయిన్ షీలా కౌర్ వివాహం జరిగింది. 

షీలా కౌర్ పేరు చెప్పగానే పరుగు, అదుర్స్, మస్కా లాంటి చిత్రాలు గుర్తకు వస్తాయి. పరుగు చిత్రం షీలాకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. లంగా ఓణీలో షీలా ఆ చిత్రంలో మెప్పించింది. అదుర్స్, మస్కా చిత్రాల్లో అందాలు ఆరబోసిన షీలా యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది. షీలా చివరగా బాలయ్య పరమవీర చక్ర చిత్రంలో నటించింది. ఆ తర్వాత షీలాకు అవకాశాలు దక్కకపోవడంతో వెండితెరకు దూరమైంది. 

'TENET' తెలుగు ట్రైలర్: మరణానంతర జీవితం.. వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ మరో ఛాలెంజ్

ఇక లైఫ్ లో సెటిల్ కావాలని నిర్ణయించుకుందో ఏమో కానీ.. సడెన్ గా షీలా పెళ్లి పీటలెక్కేసింది. ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని షీలా వివాహం చేసుకుంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి. బుధవారం రోజు చెన్నైలో కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల సమక్షంలో షీలా వివాహం ప్రైవేట్ వేడుకగా జరిగింది. 

నిండు గర్భంతో హీరోయిన్.. బికినీలో ఇన్ని సాహసాలా

షీలా తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది. షీలా వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.