కీరవాణి తనయులు శ్రీసింహా ప్రధాన పాత్రలో, మరో తనయుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం మత్తువదలరా. డెబ్యూ దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి హాస్యంతో సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. 

మత్తువదలరా చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. సక్సెస్ మీట్ లో కీరవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ మీట్స్ పై ఒకరకమైన అభిప్రాయం నెలకొని ఉంది. సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు అంటే ఆ చిత్రం ఫ్లాప్ అయి ఉంటుందనే అభిప్రాయం నెలకొని ఉంది. 

సినిమా వాళ్లకు వేరే డిక్షనరీ ఉంది. బాబు గారు అంటే హీరో అని అర్థం.. సక్సెస్ మీట్ అంటే సినిమా ఫ్లాప్ అని అర్థం. మరి మత్తు వదలరా చిత్రానికి సక్సెస్ మీట్ ఎందుకు నిర్వహిస్తున్నారు.. మన సినిమా బాగానే ఉంది కదా.. మంచి మంచి న్యూస్ లు వినిపిస్తున్నాయి అని కీరవాణి అన్నారు. 

‘మహాభారతం’ మొత్తం తీస్తా : రాజమౌళి

ఈ సందర్భంగా కీరవాణి తన ఫ్యామిలీ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 2000 సంవత్సరంలో తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు కీరవాణి తెలిపారు. కెరీర్ పరంగా, డబ్బులు లేకుండా నాకు బ్యాడ్ టైం నడుస్తోంది. ఆ సమయంలో శ్రీ శ్రీ సింహాకు నాలుగేళ్లు. 

భారత రాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి!

అదే సమయంలో సింగపూర్ వెళ్లాలని ఇంట్లోవాళ్ళు అన్నారు. నాదగ్గర సింగపూర్ వెళ్లేంత డబ్బులు లేకపోవడంతో కుదరదని చెప్పాను. కానీ శ్రీ సింహా మాత్రం నేను తీసుకుని వెళతా అని ప్రామిస్ చేశాడు. ఇప్పుడు మత్తు వదలరా చిత్రంతో పారితోషికం వచ్చింది కాబట్టి.. ఆ డబ్బులతో ఇప్పుడు సింగపూర్ కి తీసుకెళతాడని అనుకుంటున్నట్లు కీరవాణి అన్నారు. మొత్తంగా కీరవాణి తన తనయుల సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 

కేసీఆర్ ముందే జోకులేసిన విజయ్ దేవరకొండ!