తెలుగు తెరపై బాహుబలి వంటి అద్భుతాలు సృష్టించిన దర్శకులలో రాజమౌళి ఒకరు. కథా,స్క్రీన్ ప్లే .. పాత్రలను మలిచే విధానం .. పాటలు .. ఫైట్ సీన్స్ షూట్ చేసే విషయంలో రాజమౌళి శైలి ప్రత్యేకం. ‘మహాభారతం’ రాజమౌళికి డ్రీమ్‌ ప్రాజెక్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయమై తాజాగా ఆయన స్పందించారు.  ‘మహాభారతం’ మొత్తం తీస్తానని   రాజమౌళి పేర్కొన్నారు. తాజాగా 'మత్తు వదలరా' సినిమాలో నటించిన ముగ్గురు నటులను రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. అదే సమయంలో వాళ్ల ప్రశ్నలకి ఆయన స్పందిస్తూ ఈ టాపిక్ గురించి మాట్లాడారు.

హాట్ హంసా నందిని.. @35లో కూడా అదే ఫిట్నెస్

మహాభారతంలోని ఒక్క పార్ట్ అయినా మీరు పూర్తి చేస్తారని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు.. మహాభారతం మొత్తం నేను పూర్తి చేయగలను అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. మహాభారతం అతి పెద్ద కథ. అయినా నేను దాన్ని నా స్టైయిల్లో మార్చుకోగలను. కథ రాసేటప్పుడు ఒత్తిడులు సహజం. వాటిని పట్టించుకోకపోతేనే ఒత్తిడి జయించగలం. నేనెప్పుడూ ఇలాగే ఆలోచిస్తానని.. అందుకే నేను టెన్షన్ ఫ్రీ ఉంటానని చెప్పుకొచ్చాడు రాజమౌళి.

అలాగే కొత్త వాళ్లతో మీరు సినిమాలు చేస్తారా? అన్న ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ... "పెద్ద హీరోలతోనే సినిమాలు చేయాలి .. చిన్న హీరోలతో చేయకూడదని నేను ఎప్పుడూ అనుకోలేదు"అన్నారు. "చిన్న హీరోలతో చేస్తే బడ్జెట్ పరిమితులు ఉంటాయి .. అలాంటివాళ్లతో చేస్తే నా రేంజ్ తగ్గిపోతుందని కూడా నేను ఎప్పుడూ ఆలోచించను. నా దగ్గరున్న కథకు పెద్ద హీరో సెట్ అవుతాడా?  చిన్నహీరో సెట్ అవుతాడా? అనే విషయాన్ని గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను. కథను బట్టి హీరోను ఎంచుకోవడమే నాకు అలవాటు. అదే పద్ధతిని ఇక ముందు కూడా అనుసరిస్తాను" అని చెప్పుకొచ్చారు.