సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తరచుగా సినీ ప్రముఖులతో భేటీ అవుతున్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన దాదాపు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ టాలీవుడ్ ని ప్రోత్సహిస్తున్నారు. టాలీవుడ్ లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా తలసాని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.   

టాలీవుడ్ లో బిగ్ ఇష్యూ.. చిరంజీవి, నాగార్జునతో తలసాని భేటీ!

తాజాగా మంత్రి తలసాని మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే తలసాని.. చిరంజీవి, నాగార్జునతో బి భేటీ అయ్యారు. వీరి భేటీలో టాలీవుడ్ కు సంబంధించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయి. 

ముఖ్యంగా కేసీఆర్ టాలీవుడ్ కు వరాల జల్లులు కురిపించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశంలో సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలపై వీరు చర్చించారు. వాటి ముఖ్యంగా ఆన్ లైన్ టికెటింగ్ విధాన అమలుపై చర్చ జరిగింది. శంషాబాద్ సమీపంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు స్థలం కేటాయింపునకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. 24 విభాగాల కార్మికులు, టెక్నీషన్స్ కు నైపుణ్యం పెంపునకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం తరుపున తలసాని చెప్పారు. 

పవన్ కళ్యాణ్ పై 'ప్యాకేజ్' విమర్శలు.. కోన వెంకట్ రెస్పాన్స్!

చిత్రపురి కాలనీ లో హాస్పిటల్, పాఠశాల నిర్మాణం కూడా చేయబోతున్నట్లు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. చిత్రపురి కాలనీ ని వెంట సినీ కార్మికులకు ఇండ్ల నిర్మాణానికి 10 ఎకరాల స్థలం కేటాయించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కల్చరల్ కేంద్రం ఏర్పాటుకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో మరో 2 ఎకరాల స్థలం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. 

ఎఫ్ డిసి తరపున సినీ, టీవీ కళాకారులకు గుర్తింపు కార్డులని కూడా పంపిణీ చేయబోతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సినీ కార్మికులకు అందే విధంగా సవరణ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్ లను అమలు చేయాలని కూడా కేసీఆర్ నిర్ణయించినట్లు తలసాని ఈ భేటీలో పేర్కొన్నారు. 

సినీ అవార్డుల ప్రధానం తదితర అంశాలపై చర్చ చర్చ జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై ఈనెల 2 వ వారంలో మరోసారి సినీ ప్రముఖులు, సంబంధిత అధికారులతో సమావేశం కావాలని నిర్ణయం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.