తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకొని విశేష ఆధరణ పొందుతున్న టీవీ సీరియల్ కార్తీక దీపం. రోజుకో కొత్త మలుపుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే తన తండ్రి ఎవరు అన్న విషయం శౌర్య తెలుసుకుంది. శౌర్యకి నిజం తెలుసు అన్న విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. ఈ క్రమంలో సీరియల్ మరింత ఆసక్తిగా మారింది. ఈనేపథ్యంలో.. ఈ రోజు రాత్రికి టీవీలో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్.. మీ కోసం ముందుగానే...

గత ఎపిసోడ్ లో... శౌర్య తన తండ్రి అడ్రస్ కోసం వెతుక్కుంటూ డాక్టర్ బాబు ఇంటికి చేరుకుంటుంది. తాను అక్కడికి వెళ్లే సమయానికి తన తల్లి దీప అక్కడ ఉంటుుంది. అప్పుడే తనకు నమ్మరాని నిజం తెలుస్తుంది. తాను ఇంతకాలం డాక్టర్ బాబు అంటూ ప్రేమగా పిలిచిన వ్యక్తే తన తండ్రి అని తెలుస్తుంది. కానీ.. తన తండ్రి కార్తీక్.. తనను, తన తల్లి దీపను వద్దు అనుకుంటున్నాడన్న విషయం తెలిసి ఏడుస్తూ.. బయటకు వెళ్లిపోతుంది.

AlsoRead కార్తీక దీపం సీరియల్ దీప అలియాస్ వంటలక్క: ఎవరీ ప్రేమీ విశ్వనాథ్?...

ఈరోజు ఏపిసోడ్ లో... తనకు, తన బిడ్డకు అన్యాయం చేయవద్దని దీప కార్తీక్ ని వేడుకుంటుంది. అయితే ఎంత డబ్బు కావాలన్నా పారేస్తాను తప్ప.. శౌర్యను తన బిడ్డగా మాత్రం అంగీకరించనని తేల్చి చెబుతాడు కార్తీక్. తనకు డబ్బు అవసరం లేదని కేవలం సౌభాగ్యం కావాలంటూ వేడుకుంటుంది దీప. ఆమె వేడుకోలును పట్టించుకోని కార్తీక్.. నువ్వు ఏమైపోతే నాకెందుకు డోంట్ కేర్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అక్కడే కూలబడిపోయి దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది.

మరో వైపు తండ్రి గురించి నిజం తెలుసుకున్న  శౌర్య.. ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్లిపోతుంది. డాక్టర్ బాబు తనకు తొలిసారి పరిచయం అయినప్పటి నుంచి తనను ప్రేమగా చూసుకున్నప్రతి సందర్భంగా శౌర్య కళ్లముందు కదలాడుతాయి. తాను, తన తల్లి ఆ ఇంట్లో అడుగుపెడితే.. కార్తీక్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతాను అనే మాటలతో శౌర్య వాస్తవానికి వచ్చేస్తుంది.

తనను ఎంతో ప్రేమగా చూసుకునే డాక్టర్ బాబు.. తండ్రిగా ఎందుకు అంగీకరించడం లేదంటూ మనసులోనే బాధపడుతుంది. దేవుడికి చెప్పుకుంటే బాధలు తీరతాయని గతంలో తల్లి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్న శౌర్య... గుడికి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఓ పూజారి తారసపడతాడు. ఆ పూజారే.. గతంలో దీప, కార్తీక్ ల పెళ్లి జరిపిస్తాడు.

AlsoRead తెలుగు టీవీ సీరియల్: మరో మలుపు తిరిగిన కార్తీకదీపం...

శౌర్య బాధేంటో తనకు చెప్పమని ఆ పూజారి ఆమెను అడుగుతాడు. తన తండ్రి తనను వద్దు అనుకుంటున్న విషయాన్ని శౌర్య పూజారికి వివరిస్తుంది. ముందుగానే దీప, కార్తీక్ ల గురించి తెలిసి ఉన్న పూజారి.. ఆ విషయం శౌర్యకు చెప్పకుండా ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు.

మీ నాన్న మంచివాడని నువ్వే చెబుతున్నావు కాబట్టి.. మీ తల్లిని అర్థం చేసుకునే వరకు వేచి ఉండమని సలహా ఇస్తాడు. ఆపూజారి సలహాకి శౌర్య చక్కగా వింటుంది.

మరో వైపు.. దీప ఏడుస్తూ.. అత్తారింటి నుంచి బయటకు వస్తుంది. పరధ్యానంగా నడుచుకుంటూ వస్తున్న దీపకు ఆమె అంతరాత్మ ఎదురౌతుంది. దీప ఎంత పెద్ద తప్పు చేస్తున్నావు..? నీ ఆత్మాభిమానం చంపుకుంటున్నావంటూ ఆ ఆత్మ... దీపను  నిలదీస్తుంది. భర్త కోసం వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నావు అంటూ మాట్లాడుతుంది.

కాగా.. తన అంతరాత్మ మాటలకు విసిగిపోయిన దీప.. తన కూతురి కోసమే తాను తన భర్త వద్దకు వెళ్లానని తేల్చి చెబుతుంది. కొద్దిసేపు మాటల యుద్ధం తర్వాత.. దీప ఓ సంచలన నిర్ణయం తీసుకుంటుంది. ఎలాగైనా తన కూతురికి తండ్రిని దగ్గర చేస్తానని చెబుతుంది. ఈ క్రమంలో తనకు తన నీడ అవసరం కూడా లేదని తేల్చి చెబుతుంది. ఎలాగైనా భర్త ఎదుట తన పవిత్రతను నిరూపించుకొని తీరుతానని శబధం చేస్తుంది. తనకు వ్యక్తిత్వం ఎక్కువ అని... ఆ వ్యక్తిత్వం తన పవిత్రతను కాపాడుకోవడమే ముఖ్యమని దీప తన అంతరాత్మకు తేల్చిచెబుతుంది.

ఆ వెంటనే... దీపకు వారణాసి( ఆటో డ్రైవర్) ఫోన్ చేసి శౌర్య స్కూల్ కి రాలేదని చెబతాడు. ఇంటికి కూడా వెళ్లలేదని చెబుతాడు. దీంతో దీప కంగారు పడుతంది. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. మరి నిజం తెలుసుకున్న శౌర్య ఏం చేయబోతోంది..? దీప తన పవిత్రతను ఎలా నిరూపించుకోబోతోంది. శౌర్య, హిమతో కలిసి తల్లిదండ్రులను కలుపుతుందా..? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. కార్తీక దీపం కొనసాగుతోంది. డైలీ అప్ డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ని ఫాలో అవ్వండి.