Asianet News TeluguAsianet News Telugu

తెలుగు టీవీ సీరియల్: మరో మలుపు తిరిగిన కార్తీకదీపం

చిన్న అనుమానంతో భార్య దీప అలియాస్ వంటలక్క (ప్రేమి విశ్వనాథ్)ను భర్త కార్తీక్ (నిరుపమ్ పరిటాల) దూరం పెరుగుతుంది. విడివిడిగా ఉంటుంటారు. వంటలక్కకు ఇద్దరు కవల ఆడపిల్లలు హిమ, శౌర్య. పురిటిలోనే ఇద్దరు కవల పిల్లలు వేరవుతారు. 

Telugu TV serial Karthika Deepam takes new turn
Author
Hyderabad, First Published Nov 20, 2019, 12:56 PM IST

హైదరాబాద్: తెలుగు కార్తీకదీపం కొత్త మలుపు తిరిగింది. స్టార్ మాలో ప్రతి సాయంత్రం 7.30 గంటలకు ప్రసారమవుతున్న డైలీ సీరియల్ ఇది. రేటింగ్ లో అదరగొడుతోంది. ఇప్పటి వరకు 657 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. నిజానికి, సీరియల్ అంత చిన్న పాయింట్ మీద కొనసాగుతూ వస్తోంది. 

 చిన్న అనుమానంతో భార్య దీప అలియాస్ వంటలక్క (ప్రేమి విశ్వనాథ్)ను భర్త కార్తీక్ (నిరుపమ్ పరిటాల) దూరం పెరుగుతుంది. విడివిడిగా ఉంటుంటారు. వంటలక్కకు ఇద్దరు కవల ఆడపిల్లలు హిమ, శౌర్య. పురిటిలోనే ఇద్దరు కవల పిల్లలు వేరవుతారు. పురిటిలోనే అత్త సౌందర్య ఓ బిడ్డను వేరు చేసి తెచ్చుకుంటుంది. ఆమె కార్తిక్ కూతురిగా హేమ పేరుతో పెరుగుతూ వుంటుంది. మరో కూతురు శౌర్య వంటలక్క వద్ద ఉంటుంది. 

మతిపోగొడుతోన్న ఇల్లీ బేబీ అందాలు.. ఓ లుక్కేయండి!

చాలా కాలం వరకు సౌందర్యకు, ఆమె భర్తకు తప్ప దీపకు ఇద్దరు కూతుళ్లనే విషయం ఎవరికీ  తెలియదు. కానీ, క్రమంగా అందరికీ తెలిసిపోతుంది, ఇద్దరు కవల పిల్లలకు తప్ప. మోనిత అనే గైనకాలిజిస్టు కార్తిక్ ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తప్పు దోవ పట్టించడం కారణంగా, దీపతో ఓ వ్యక్తి తరుచుగా మాట్లాడుతుండడం అనే రెండు కారణాలను ప్రాతిపదికగా తీసుకుని సీరియల్ వందలాది రోజులు నడుస్తూ ఉంది. 

దీపకు, మరో వ్యక్తికి అక్రమ సంబంధం వల్ల పిల్లలు పుట్టారని, తన వల్ల కాదని కార్తిక్ నమ్ముతూ ఉంటాడు. ఈ నమ్మకం సరైంది కాదని తేలిపోతే సీరియల్ ముందుకు సాగే అవకాశం లేదు. కార్తిక్ వైద్య పరీక్షల రిపోర్ట్ తప్పుగా వచ్చేలా మోనిత ఆడిన డ్రామానే ఈ సీరియల్ కు ఆయువుపట్టు. కార్తిక్ కు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఓ తప్పుడు రిపోర్టును మోనిక సృష్టిస్తుంది. 

మరోసారి టెస్టు చేయించుకోవడానికి కార్తిక్ ససేమిరా అంటాడు. మరోసారి టెస్టు చేయించుకోవాలని దీప కాళ్లావేళ్లా పడినా అతను వినడు. కథ ప్రధానంగా మోనిక, దీప మధ్య ఘర్షణగా సాగుతూ, దీపనూ కార్తిక్ నూ కలపాలని కార్తిక్ తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలతో ముందుకు నడుస్తూ వచ్చింది. 

మధ్యలో విడాకుల వ్యవహారం, కోర్టు వ్యవహారాలు, చాలా చాలా వ్యవహారాలు ఇంతకాలం నడుస్తూ వచ్చాయి. తండ్రికి పెళ్లి చేయాలని హిమ అనుకుంటూ ఉంటుంది. అయితే, మోనికతో తండ్రి పెళ్లి చేస్తుందేమోనని కలవరపడే సమయంలో హిమ తన అభిప్రాయం చెప్పడం ద్వారా కథను ఓ మలుపు తిప్పారు. వంటలక్కతో కార్తిక్ కు పెళ్లి చేస్తే బాగుంటుందని హిమ ప్రతిపాదిస్తుంది. దాంతో శౌర్యకు కోపం వస్తుంది.

తల్లి చెప్పిన మాటల వల్ల తన తండ్రి దుబాయ్ లో ఉన్నాడని శౌర్య నమ్ముతూ ఉంటుంది. తన తండ్రిని కనిపెట్టే అన్వేషణలో శౌర్యకు తండ్రి చిరునామా దొరుకుంది. ఆ చిరునామా ఆధారంగా తండ్రి ఉండే ఇంటికి చేరుకుంటుంది. శౌర్య వాలకం చూసి దీప కార్తిక్ ఇంటికి పరుగెత్తుకుని వచ్చి అత్తమామలతో మాట్లాడుతూ ఉంటుంది. అందులోకి కార్తిక్ కూడా ప్రవేశిస్తాడు. వారి మధ్య జరిగే సంభాషణను తన తండ్రి చిరునామా వెతుక్కుంటూ వచ్చిన శౌర్య వింటుంది. 

వారి మధ్య జరిగే సంభాషణల ద్వారా కార్తిక్ తన తండ్రి అనే విషయాన్ని శౌర్య తెలుసుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంటి నుంచి వెనక్కి వెళ్లిపోతూ కంటనీరు పెట్టుకుంది. ఆ కుటుంబ సభ్యులు తనపై కురిపించిన ప్రేమను తలుచుకుంటూ ఉంటుంది. 

ఇక్కడ సీరియల్ మొత్తం మరో మలుపు తిరిగింది. ఇప్పుడు కథను ఎలా నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద, దీప పాత్రను పోషించిన ప్రేమి విశ్వనాథ్ ప్రతి తెలుగు ఇంటిలో మనిషిగా మారిపోయింది. నల్లదీప అంటూ ఆమెను ముద్దుగా పిలుచుకుంటూ ఉన్నారు కూడా..

Follow Us:
Download App:
  • android
  • ios