దేశం గర్వించదగ్గ దర్శకులలో శంకర్ ఒకరు. సందేశాన్ని, వినోదాన్ని మిళితం చేసి వెండితెర అద్భుతాలు తెరక్కించడం లో ఆయనకు ఆయనే సాటి. గత కొంత కాలంగా శంకర్ టైం సరిగా లేనట్లు ఉంది. ఆయన చిత్రాలు బాగా ఆడకపోగా.. తెరకెక్కిస్తున్న ప్రతి చిత్రానికి ఏదో ఒక ఆటంకం ఏర్పడుతోంది. 

గత రాత్రి ఇండియన్ 2 సెట్స్ లో జరిగిన ఘోర ప్రమాదం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. షూటింగ్ కోసం క్రేన్ కు లైటింగ్ సెట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్రేజ్ విరిగి పడడంతో ముగ్గురు సిబ్బంది అక్కడిక్కడే మృతి చెందారు. 10 మంది సిబ్బందికి పైగా గాయాలయ్యాయి. 

ఈ ప్రమాదంలో దర్శకుడు శంకర్ కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కాళ రాత్రి లాంటి ఈ సంఘటనపై లొకేషన్ లో ఉన్న చిత్ర యూనిట్ లో ఒక్కొక్కరు నోరు విప్పుతున్నారు. 

తాజాగా కాస్ట్యూమ్ డిజైనర్ అమృతా రామ్ ఈ సంఘటనపై స్పందించింది. 'మాకు కాలం కలసి వచ్చిందో లేక మీ అందరి ఆశీర్వాదాలో తెలియదు కానీ కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ తో పాటు నేను కూడా ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాం. క్రేన్ విరిగిపడ్డ పది సెకండ్ల ముందు కమల్ సర్, కాజల్, నేను ఆ స్పాట్ నుంచి పక్కకు వచ్చాం. ప్రాణాలు కోల్పోయిన మా సహచరుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా' అంటూ అమృతా రామ్ ఈ సంఘటనపై స్పందించింది. 

'ఇండియన్ 2' యాక్సిడెంట్.. కాజల్ జస్ట్ మిస్!

క్రేన్ విరిగిపడ్డ ప్రదేశంలోనే దర్శకుడు శంకర్, అతడి వ్యక్తిగత సహాయకుడు మధు(29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), మరో సిబ్బంది చంద్రన్ ఉన్నారు. మధు, సాయి కృష్ణ, చంద్రన్ అక్కడికక్కడే మృతి చెందారు. శంకర్ కాలికి బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. 

'ఇండియన్ 2'కి ఆది నుంచి కష్టాలే.. శంకర్ ఆకలి బాధకంటే ఎక్కువే!