ఇండియన్ 2  షూటింగ్ లో క్రేన్ విరిగిపడటం సినిమాకు మరొక పెద్ద దెబ్బ అని చెప్పాలి. గత కొంత కాలంగా వివిధ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శంకర్ ఫైనల్ గా సినిమాను ఒక ట్రాక్ లో నడిపిస్తున్నాడు అనుకుంటున్న సమయంలో పెను ప్రమాదం సంభవించడం భారీ దెబ్బె అని చెప్పాలి. ఇద్దరు సహాయక దర్శకులు, ఒక డైలీ వర్కర్ అక్కడిక్కడే మృతి చెందడం పెను విషాదాన్ని నింపింది.

పది మందికి గాయాలవ్వగా శంకర్ కాలికి కూడా తీవ్ర గాయాలు కావడంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ సినిమా షూటింగ్ స్టార్ట్ కావాలంటే చాలా సమయం పడుతుంది. అయితే ఈ ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో ప్రాణాలతో కాజల్ బయటపడింది. ఈ విషయాన్నీ కాజల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అలాగే ఘటనలో ముగ్గరు మరణించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

"యాక్సిడెంట్ జరగడం నాకు ఎంతో బాధను కలుగజేసింది.నా స్నేహితుల్లాంటి ముగ్గురు కొలీగ్స్ మరణించడం బాధాకరం. నాకు మాటలు రావడం లేదు. వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ ప్రమాదం నుంచి నేను కొద్దీ దూరంలో ఉండి తప్పించుకున్నాను. అందుకే ఇప్పుడు ట్వీట్ చేయగలుగుతున్నాను. టైమ్ లైఫ్ చాలా నేర్పిస్తుంది". అని కాజల్ వివరణ ఇచ్చారు.

'ఇండియన్ 2'కి ఆది నుంచి కష్టాలే.. శంకర్ ఆకలి బాధకంటే ఎక్కువే!