'ఇండియన్ 2'కి ఆది నుంచి కష్టాలే.. శంకర్ ఆకలి బాధకంటే ఎక్కువే!

First Published 20, Feb 2020, 10:43 AM IST

ఇండియన్ 2 షూటింగ్ లో జరిగిన ఘటన అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అయితే సినిమా ఆది నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. స్క్రిప్ట్ దగ్గర నుంచి సినిమా సెట్స్ పైకి వచ్చిన తరువాత అలాగే షూటింగ్ సమయంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమాకు వచ్చిన కష్టాలు శంకర్ కెరీర్ మొదట్లో పడిన ఆకలి బాధలకంటే ఎక్కువే అని అర్ధమవుతోంది.   మొదట భారతీయుడు 2ని దిల్ రాజు నిర్మించాల్సింది. కానీ బడ్జెట్ కారణాల వల్ల దిల్ రాజు సినిమా మొదలవ్వకముందే డ్రాప్ అయ్యాడు.

ఇక లైకా ప్రొడక్షన్స్ ముందుకు వచ్చినప్పటికీ శంకర్ 2.0 అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో బడ్జెట్ ని తగ్గించాల్సిందేనని వాదోపవాదాలు నడిచాయి. షూటింగ్ కి మద్యమద్యలో బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా నటీనటులు కూడా సినిమా  నుంచి తప్పుకోవడం వైరల్ అయ్యింది.

ఇక అంతా క్లియర్ అయ్యింది అనుకుంటున్నా సమయంలో షూటింగ్ లో క్రేన్ విరిగిపడటం మరొక పెద్ద దెబ్బ అని చెప్పాలి. ముగ్గురు మరణించగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక శంకర్ కాలికి కూడా తీవ్ర గాయాలు కావడంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ సినిమా షూటింగ్ స్టార్ట్ కావాలంటే చాలా సమయం పడుతుంది.

డైరెక్టర్ శంకర్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. రోబో సినిమా అనంతరం శంకర్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే శంకర్ ఆ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను చూశాడు. కెరీర్ మొదట్లో ఆయన పడిన ఇబ్బందులు ఆకలి బాధలు ఎవరు పడలేదేమో అనిపిస్తుంది.

ఒకానొక సమయంలో వారం రోజులు తిండి లేకుండా ఉన్న శంకర్ చెన్నైలోని ఒక స్టూడియో ముందు పడిపోయారు. శంకర్ ముందు యాక్టర్ అవ్వాలని అనుకున్నాడు.  కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కనిపించాడు. స్టార్ హీరో విజయ్ తండ్రి చంద్ర శేఖర్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన దగ్గర సహాయక దర్శకుడిగాపని చేసి మొదటి అవకాశం కోసం ఎంతగానో శ్రమించాడు.

మొదటి సినిమా జెంటిల్ మెన్ తెరకెక్కించడానికి శంకర్ చాలా మంది హీరోలను సంప్రదించగా వారి నుంచి అవమానాలని కూడా ఎదుర్కోవాల్సి వాచ్చింది. ఫైనల్ గా అర్జున్ సహకారంతో సినిమాని తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత వెనక్కి తిరిగిచూసుకోలేదు.

అయితే ఈ మధ్య కాలంలో శంకర్ ఊహించని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. 2.0 సినిమా విషయంలో కూడా పలు సమస్యలతో సతమతమైన శంకర్ ఇప్పుడు ఇండియన్ 2కి అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ని ఫెస్ చేస్తున్నాడు.

ఒకప్పుడు సినిమా స్టార్ట్ చేస్తే శంకర్ పనికి ఎవరు అడ్డు చెప్పేవారు కాదు. కానీ ఇప్పుడు ఆయన వేసే ప్రతి అడుగులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది, మరీ ఈ సమస్యలను దాటి ఇండియన్ సీక్వెల్ ని ఎప్పుడు తెరపైకి తెస్తారో చూడాలి.

loader