యావత్ సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టివేసిన సంఘటన ఇండియన్ 2 సెట్స్ లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. క్రేన్ విరిగిపడ్డ భారీ ప్రమాదంలో మధు, సాయి కృష్ణ, చంద్రన్ అనే టెక్నీషియన్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దర్శకుడు శంకర్ కూడా గాయాలపాలయ్యారు. 

లైటింగ్ సెటప్ ఏర్పాటు చేస్తున్న క్రేన్ అకస్మాత్తుగా విరిగి పడడంతో ఈ ఘోరం జరిగింది. ఈ సంఘటన చిత్ర యూనిట్ ని విషాదంలోకి నెట్టివేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ సంస్థ, కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ స్పందించారు. 

ఈ సంఘటన తనని ఎంతగానో కలచివేసిందని కమల్ హాసన్ స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా కమల్ హాసన్ మృతుల కుటుంబాలకు తనవంతు విరాళం ప్రకటించారు. మృతి చెందిన వారి ముటుంబాలకు ఒక్కొక్కరికి రూ కోటి విరాళం అందించబోతున్నట్లు కమల్ హాసన్ తెలిపారు. 

ఇండియన్ 2 ప్రమాదం: కమల్ హాసన్, కాజల్ ఇద్దరూ.. 10 సెకండ్లే తేడా..

బుధవారం రాత్రి 10 గంటలకు ఈ సంఘటన జరిగింది.సెట్స్ లో కాజల్, కమల్ కూడా అక్కడే ఉన్నారు. కానీ అదృష్టవశాత్తూ వీరిద్దరూ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఈ సంఘటనతో తమిళ చిత్ర పరిశ్రమ మొత్తం షాక్ లో ఉంది. 

'ఇండియన్ 2'కి ఆది నుంచి కష్టాలే.. శంకర్ ఆకలి బాధకంటే ఎక్కువే!

మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, చిత్ర యూనిట్ కి ధైర్యం చెబుతూ పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.