సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడంతో సరిలేరు నీకెవ్వరు మూవీపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. 

ఇప్పటికే చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఓ టివి ఛానల్ మచిలీపట్నంలో సంక్రాంతి సంబరాలు ప్రోగ్రాం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మహేష్ అతిథిగా హాజరయ్యాడు. అందుకోసం మహేష్ మచిలీపట్నం కూడా చేరుకున్నాడు. కానీ అనుకోకుండా వర్షం పడడంతో మహేష్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనలేకపోయాడు. దీనితో మహేష్ బాబు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. 

కిల్లర్ లేడీస్.. హత్యలు చేసేందుకు కూడా వెనుకాడని హీరోయిన్లు!

మహేష్ వెళ్లిన కొంత సమయానికే వర్షం తగ్గింది. దీనితో సాయంత్రం సదరు టీవీ ఛానల్ మహేష్ లేకుండానే ఈవెంట్ కంటిన్యూ చేసింది. ఆంధ్ర జాతీయ కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహేష్ వస్తుందని తెలియడంతో వేలాదిగా అభిమానులు, విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు.

చిరంజీవి, మహేష్, విజయశాంతి ఎఫెక్ట్.. పోలీసులు ఏం చేస్తున్నారంటే..

కానీ మహేష్ వెనుదిరగడంతో అభిమానులకు నిరాశ తప్పలేదు. ఆదివారం రోజు సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ బిగ్గెస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ ని నిర్వహించబోతోంది. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. 

యంగ్ హీరోయిన్ తో గుత్తా జ్వాల ప్రియుడు రొమాన్స్!