హైదరాబాద్: కరోనా వైరస్ కు చికిత్స పొంది నటి జీవితా రాజశేఖర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆమెకు కరోనా నెగెటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆమెను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. కాగా, హీరో రాజశేఖర్ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కరోనా వ్యాధి సోకడంతో రాజశేఖర్ కుటుంబ సభ్యులు ఇటీవల ఆస్పత్రిలో చేరారు. రాజశేఖర్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని నాలుగు రోజుల క్రితం కూతురు శివాత్మిక ట్వీట్ చేసింది. అయితే, ఆ తర్వాత దానిపై వివరణ కూడా ఇచ్చారు. 

Also Read: త్వరగా కోలుకుని షూటింగ్‌ల్లో పాల్గొంటాడు.. రాజశేఖర్‌ ఆరోగ్యంపై మోహన్‌బాబు కామెంట్

రాజశేఖర్ ఆరోగ్యంపై జీవిత రాజశేఖర్ స్పందించారు. రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. ఆయన కోలుకుంటున్నారని కూడా చెప్పారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆమె కోరారు. రాజశేఖర్ కరోనా వైరస్ వ్యాధికి సిటీ న్యూరో సెంటర్ చికిత్స పొందుతున్నారు. 

రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ఆశించారు  రాజశేఖర్, జీవిత దంపతులు కూతుళ్లు శివాని, శివాత్మికలకు కరోనా వైరస్ సోకినట్లు అప్పట్లో చెప్పారు. 

Also Read: రాజశేఖర్‌ కోలుకుంటున్నారు.. పుకార్లని నమ్మవద్దుః జీవితా రాజశేఖర్‌.